
పోలీసుల పహారాలో..
జిల్లాలో రైతులు అధికంగా వరిపంట సాగు చేస్తారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో 58,251 హెక్టార్లలో వరిపంట సాగు చేశారు. పంట ఎదిగి చేతికి రావాలంటే రైతులు అధికంగా యూరియా వాడతారు. గత ప్రభుత్వంలో యూరియా కోసం ఎప్పుడూ రైతులు రోడ్డెక్కలేదు. గ్రామంలోనే యూరియా దొరికేది. ప్రస్తుతం ఒక్క యూరియా బస్తా కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. పాసు పుస్తకాలు పట్టుకొని క్యూలైన్లలో నిలబడుతున్నా దొరకని పరిస్థితి నెలకొంది. యూరియా ఆదిలోనే అందించకపోతే పంట దెబ్బతినే ప్రమాదం ఉంది. రైతులు రోజుల తరబడి యూరియా కోసం వేచి చూడాల్సి వస్తోంది. టీడీపీకి చెందిన వారికి అయితే ఎన్ని బస్తాలు అయినా ఇస్తున్నారని రైతులు వాపోతున్నారు. ప్రైవేటు డీలర్ల వద్దకు యూరియా కోసం వెళితే కాంప్లెక్స్ ఎరువులు కొనాలని బలవంతం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.