
ఎన్ని ఎకరాలు ఉన్నా మూడు బస్తాలే
ఎకరా ఉన్న రైతుకు బస్తా, ఐదెకరాల లోపు ఉన్న రైతులకు మూడు బస్తాలు..అంత కంటే ఎన్ని ఎకరాలు ఉన్నా ఒక రైతుకు 3 బస్తాలకు మించి యూరియా ఇవ్వకూడదని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా టీడీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు చాలా చోట్ల రైతుకు 10 నుంచి 20 యూరియా బస్తాల చొప్పున పంపిణీ చేసుకున్నారు. రైతు సేవా కేంద్రాల వద్దకు వాహనం రాకుండానే మధ్యలోనే టీడీపీ నాయకులు వాటిని పంచుకున్న సంఘటన గోస్పాడు మండలం పసురపాడులో చోటు చేసుకుంది. అధికారులు దగ్గరుండి రైతు సేవా కేంద్రాల వద్ద యూరియా పంపిణీ చేయాల్సి ఉంది. కాగా టీడీపీ నాయకులు తమ వారికి అయితే ఒకే అంటూ అధికారులకు చెబుతూ వారి కార్యకర్తలు, అనుచరులకే యూరియా బస్తాలు పంపిణీ చేయించుకుంటుండటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అనుచరులకు 20 బస్తాల వరకు దక్కినట్లు తెలుస్తోంది.