
‘సప్త’ శోభితం
జిల్లా ప్రజలు వినాయక చవితి పండుగను వైభవంగా నిర్వహించారు. నంద్యాలలో సప్త గవ్వలతో ఏర్పాటు చేసిన విశ్వశాంతి మహా గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. – నంద్యాల(వ్యవసాయం)
కర్నూలు(అగ్రికల్చర్): అనర్హత పేరిట దివ్యాంగుల పింఛన్లకు ఎసరు పెట్టడంపై సర్వత్రా విమర్శలు, ఆందోళనలు వెల్లువెత్తుతుండటంతో కూటమి ప్రభుత్వం వెనక్కు తగ్గినట్లుగా కనిపిస్తోంది. సెప్టెంబర్ నెలకు సంబంధించి పింఛన్ల పంపిణీకి కోత లేకుండానే నిధులు విడుదల చేసింది. ఆగస్టు నెలకు ఉమ్మడి జిల్లాలో 4,55,168 పింఛన్లు ఉండగా.. సెప్టెంబరు నెలకు ఉమ్మడి జిల్లాలో 4,54,653 పింఛన్లకు రూ.196.01 కోట్లు విడుదల చేసింది. నిధుల మంజూరును పరిశీలిస్తే 515 పింఛన్లకు కోత పడ్డాయి. అయితే ఈనెల 31న కచ్చితంగా ఎన్ని పింఛన్లు సెప్టెంబర్ 1న పంపిణీ చేస్తారనే విషయమై స్పష్టత వస్తుందని అధికారులు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 8,400 దివ్యాంగుల పింఛన్లకు అనర్హత పేరుతో నోటీసులు ఇచ్చారు. వందలాది దివ్యాంగుల పింఛన్లను వృద్ధాప్య పింఛనుగా మార్పు చేశారు. వీటి భవితవ్యం ఈ నెల 31 లేదా సెప్టెంబర్ 1వ తేదీన తెలియనుంది.