
అధిక వర్షాలు ఉన్నా.. రైతులకు సుఖం లేదు!
హాలహర్వి: నిట్రవట్టి గ్రామంలో మంగళవారం శ్రావణ శుద్ధ దశమి వేడుకలు ఘనంగా జరిగాయి. వసిగేరప్ప తాత భక్తుడు కె.ఏజీ భవిష్యవాణి వినిపించారు. ముంగారి వర్షాలు విశేషంగా గాలి నుంచి మేఘాల ద్వారా వస్తాయని, అయినా రైతులకు సుఖం ఉండదన్నారు. హింగారి వర్షాలు ఏడు కార్తీలు ఉరుములు, మెరుపుల ద్వారా వస్తాయన్నారు. రెండు తుపాన్‌లు ఉంటాయన్నారు. తెల్ల గుర్రం, ఎర్ర గుర్రం వెనుకా ముందు పరుగులు పెడతాయని చెప్పారు. ఆరు మూడు అవుతుంది, మూడు ఆరు అవుతుందని వివరణ ఇచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో భవిష్యవాణిని వినేందుకు తరలించ్చారు.
● భవిష్యవాణి వినిపించిన వసిగేరప్పతాత భక్తుడు

అధిక వర్షాలు ఉన్నా.. రైతులకు సుఖం లేదు!