
వైఎస్సార్‌సీపీ పాలనలో ఐదేళ్లూ పెరగని ధరలు
ఒక్క ఎరువు బస్తా కూడా దొరకలేదు
గతేడాది పండించిన పంటలకు మద్దతు ధర లభించకపోవడంతో తీవ్రంగా నష్టపోయా. ఈ ఏడాది ఖరీఫ్‌కు అవసరమైన యూరియా ఆర్‌ఎస్‌కే, సహకార సొసైటీల్లో దొరకడం లేదు. యూరియా ఎప్పుడు వస్తుందో.. ఎటు వెళ్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. టీడీపీ నాయకులు వాటిని గద్దల్లా తన్నుకపోతున్నారు. పేరు నమోదు చేసుకొని పది రోజులు అవుతున్నా ఒక్క యూరియా బస్తా దొరకలేదు.
– మధుబాబుగౌడ్, కానాల గ్రామం, నంద్యాల మండలం
అడ్డగోలుగా ధరలు
పెంచేస్తున్న కంపెనీలు
● నోరు మెదపని కూటమి ప్రభుత్వం
● ఇప్పటికే మూడుసార్లు పెరిగిన ధరలు
● ఒక్కో రైతుపై రూ.4వేల నుంచి
రూ.6వేల భారం
● పెట్టుబడిలో రసాయన ఎరువుల ఖర్చే
అధికం
● గగ్గోలు పెడుతున్న రైతులు
నంద్యాల(అర్బన్)/కర్నూలు(అగ్రికల్చర్): మోతాదుకు మించి రసాయన ఎరువులను వినియోగంతో వ్యవసాయంలో పెట్టుబడి వ్యయం పెరిగిపోతోంది. ఎరువుల వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సి ఉండగా కాగితాలకే పరిమితం అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఎరువుల ధరలు అడ్డుగోలుగా పెరిగిపోవడం పట్ల రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో ఎరువుల ధరలు పెంచే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంది. అయితే ఉత్పత్తి వ్యయానికి అనుగుణంగా ధరలు పెంచుకునే వెసులుబాటును కేంద్రం ఫర్టిలైజర్ కంపెనీలకు ఇవ్వడంతో ధరలు ఏడాదిలో రెండు, మూడు సార్లు పెంచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ, జనసేన మద్దతు ఇస్తున్నాయి. రాష్ట్రంలోనూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం కొనసాగుతోంది. అయినప్పటికీ ధరల పెరుగుదలను నిలువరించే ప్రయత్నం చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఏటా దాదాపు 5 లక్షల టన్నుల రసాయన ఎరువులు వినియోగిస్తున్నారు. ఒక టన్ను అంటే 50 కిలోల బస్తాలు 20 ఉంటాయి. బస్తాపై కనిష్టంగా రూ.50 నుంచి రూ.330 వరకు ధర పెరిగింది. అంటే టన్నుపై కనిష్టంగా రూ.1000 నుంచి గరిష్టంగా రూ.6వేల వరకు ధర పెరగడం ఆందోళన కలిగిస్తోంది. త్వరలోనే డీఏపీ ధర కూడా భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
టీడీపీ ‘పైసా’చికం
నంద్యాల పట్టణ సమీపంలోని రైతునగర్, నూనెపల్లె ప్రాంతాలను టీడీపీ నాయకులు ఎరువు కేంద్రాలుగా చేసుకున్నారు. అధిక ధరలకు విక్రయిస్తున్నారు. నిత్యం వందలాది యూరియా లోడ్‌లు ఇక్కడికి వచ్చి ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నాయి. గత వారం 6వేల మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు వస్తుందని అధికారులు పేర్కొనగా 2,600 టన్నులు మాత్రమే వచ్చింది. వచ్చిన వాటిలో ప్రతి ఆర్‌ఎస్‌కేకు రెండు లారీలు (దాదాపు 532 ప్యాకెట్లు), సొసైటీలకు రెండు లారీలు యూరియా పంపారు. ఆర్‌ఎస్‌కేలు, సొసైటీలకు వస్తున్న ఎరువులను టీడీపీ నేతలు ఇతర ప్రాంతాలకు తరలించి నిల్వ చేస్తున్నారు. అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల యూరియా కోసం నందికొట్కూరు మండలంలో రైతులు రోడ్డెక్కారు. సోమవారం నంద్యాల మండలం కానాల గ్రామ రైతుల రాస్తారోకో చేశారు. అధికారులతో వాగ్వాదం చేశారు. గోస్పాడు మండలం సాంబవరం గ్రామంలో టీడీపీ వారికే యూరియా ఇస్తాం, ఇతరులకు ఇవ్వమంటూ అధికారుల ముందే టీడీపీ నాయకులు హెచ్చరికలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.
పెరిగిన రసాయన ఎరువుల ధరలు ఇలా..
ఎరువు పేరు పాత ధర కొత్త ధర
(రూ.లలో)
పోటాష్ 1535 1800
20–20–0–13 1300 1425
(ప్యాక్ట్)
20–20–0–13 1300 1350
(గ్రోమర్)
20–20–0–13 1300 1400
(పీపీఎల్)
10–26–26 1470 1800
12–32–16 1470 1720
(ఇప్కో)
16–16–16 1450 1600
14–35–14 1700 1800
(గ్రోమర్)
సింగల్ 580 640
సూపర్ పాస్పేటు
16–20–0–13 1250 1300
2014–15 నుంచి 2018–19 వరకు టీడీపీ అధికారంలో ఉంది. అప్పట్లో కూడా టీడీపీ బీజేపీ కొమ్ము కాసింది. ఆ సమయంలో ఏకంగా నాలుగైదు సార్లు రసాయన ఎరువుల ధరలు పెరిగాయి. 2019–20 నుంచి 2023–24 మధ్య వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉంది. ఆ సమయంలో రసాయన ఎరువుల ధరలు ఒక్కసారి కూడా పెరిగిన దాఖలాలు లేవు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 14 నెలల్లోనే రైతుల నడ్డి విరిగే విధంగా ఽమూడు దఫాలుగా ధరలు పెంచడం గమనార్హం. ఎరువుల ధరలు పెంచడంలో టీడీపీ, జనసేనలు కేంద్రానికి పూర్తి మద్దతు ఇచ్చాయనే ప్రచారం జరుగుతోంది.

వైఎస్సార్‌సీపీ పాలనలో ఐదేళ్లూ పెరగని ధరలు

వైఎస్సార్‌సీపీ పాలనలో ఐదేళ్లూ పెరగని ధరలు