
అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
శ్రీశైలంటెంపుల్: దేవస్థానం పరిధిలో హోటల్ నిర్వాహకులు ఆహార పదార్థాలను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు హెచ్చరించారు. సోమవారం ‘సాక్షి’ దినపత్రికలో ‘భక్తుల జేబుకు చిల్లు’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు స్పందించారు. క్షేత్ర పరిధిలోని పలు హోటల్స్‌లో ఆహర పదార్థాలు అధిక ధరలకు విక్రయించకూడదని, ధరల పట్టికను హోటల్ ముందు ప్రదర్శించాలని ఆదేశించారు. దేవస్థాన మైక్‌తో హోటల్ నిర్వాహకులకు తెలిసే విధంగా సూచనలు జారీ చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.