
మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలంలో వెలసిన శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మ వార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. అదివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు శ్రీగిరి చేరుకుని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. వేకువ జామున పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూ లైన్లలో బారులు తీరారు. భక్తుల రద్దీతో ఆలయ క్యూ లైన్లు నిండి పోయాయి. క్యూ లైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, అల్పాహారం, బిస్కెట్లు దేవస్థాన అధికారులు పంపిణీ చేశారు. భక్తుల శివ నామ స్మరణతో శ్రీశైల ఆలయం మారుమోగింది. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులు కళకళలాడుతున్నాయి.
ఉద్యోగుల సమస్యలపై ‘మాట్లాడుకుందాం రండి’
నంద్యాల(న్యూటౌన్): సమస్యల పరిష్కారం కోసం ఈనెల 5న నంద్యాల జిల్లాలో ‘రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం’ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ ం నంద్యాల జిల్లా అధ్యక్షుడు నాగేంద్రప్ప పేర్కొన్నారు.ఆదివారం స్థానిక కార్యాలయంలో ఏర్పా టు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలతో పాటు ఉద్యోగులకు రా వాల్సిన ఆర్థిక బకాయిలపై ఉద్యోగులతో టీ తా గుతూ చర్చించడం జరుగుతుందన్నారు. ఉద్యోగులకు రావాల్సిన రూ.35 వేల కోట్లకు సంబంధించిన బకాయిలు దాదాపు 27 రకాల సమస్యలను మాట్లాడుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర సంఘం ఆదేశాలకు అను గుణంగా చేపడుతున్నట్లు వివరించారు. ఉద్యోగులందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నా రు. కార్యక్రమంలో ఆళ్లగడ్డ తాలూకా ఏడీఏ విజయశేఖర్, జిల్లా కార్యదర్శి తిరుపాలయ్య, జిల్లా కోశాధికారి శ్రీనివాసులు, సహాయ కార్యదర్శులు సునిల్‌కుమార్, విజయలక్ష్మి, నంద్యాల అధ్యక్షు డు సత్యం, వెంకటశివన్న, చక్రధర్ పాల్గొన్నారు.
నేడు ఆత్మకూరులో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 11.30 గంటలకు ఆత్మకూరు ఆర్‌డీఓ కార్యాలయంలో జరిగే ఈ కార్యక్రమంలో తనతో పాటు జిల్లా అధికారులు హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారన్నారు. జిల్లా అధికారులందరూ ఉదయం 11.00 గంటలకు ఈ కార్యక్రమానికి తప్పక హాజరుకావాలన్నారు. అలాగే కలెక్టరేట్‌తో పాటు మండల, డివిజన్ కేంద్రాలు, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించి ప్రజల నుంచి యథావిధిగా విజ్ఞప్తులు స్వీకరిస్తారని చెప్పారు. అర్జీదారులు తమ దరఖాస్తులను జిల్లా కలెక్టరేట్‌కు వచ్చే అవసరం లేకుండా meekosam. ap. gov. in లో ఆన్‌లైన్ ద్వారా కూడా సమర్పించవచ్చునన్నారు. దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో ప్రస్తుత సమాచారం ఆన్‌లైన్‌లో తెలుస్తుందని లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1100ను సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు.

మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు