
మెరుగైన వైద్య సేవలు అందించండి
శ్రీశైలంప్రాజెక్ట్/ శ్రీశైలం టెంపుల్: రోగులకు వైద్యులు నిత్యం అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఆదేశించారు. సున్నిపెంట కమ్యూనిటీ హెల్త్ సెంటర్, శ్రీశైలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను ఆదివారం ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రతిరోజు ఎంత మంది పేషెంట్లు ఆసుపత్రికి వస్తున్నా రు? వైద్యులు అందుబాటులో ఉన్నారా.. లేదా? ఎంత మంది డాక్టర్లు, సిబ్బంది పని చేస్తున్నారా లేదా?.. అంటూ వైద్య సిబ్బందిని, పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరు పేదలు మాత్రమే ప్రభుత్వాసుపత్రులకు వస్తుంటారని, వారిని దృష్టిలో ఉంచుకొని మానవత్వంతో వైద్యం అందించాలన్నారు. సున్నిపెంట కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్ వెంట డాక్టర్ లీలా వినయ్‌రెడ్డి, డాక్టర్ యజ్ఞప్రసాద్, హెడ్‌నర్స్ విజయలక్ష్మి తదితరులు ఉన్నారు.