
కారుణ్య నియామకాలు
కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ పరిధిలో నలుగురికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలను కల్పించి వివిధ కార్యాలయాలకు పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చారు. జెడ్పీలో జరిగిన ఈ కార్యక్రమంలో చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల మేరకు కారుణ్య నియామకాల కింద మృతిచెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పించామన్నారు. జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి మాట్లాడుతూ.. జెడ్పీ యాజమాన్య పరిధిలోని ఆయా కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న కార్యాలయ సహాయకుల పోస్టుల్లో వీరి ని నియమించామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఉద్యోగాలు పొందిన వారిలో నీరజాబాయి (జెడ్పీహెచ్‌ఎస్, నొస్సం), పీ శేఖర్ (ఎంపీపీ, ఓర్వకల్), ఎన్ రమాదేవి (పీఆర్ పీఐయూ డివిజన్, నంద్యాల), విజయ కుమారి (జెడ్పీహెచ్‌ఎస్, గార్గేయపురం) ఉన్నారు.