
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ
● ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా
నంద్యాల: రెడ్‌బుక్ అరాచకానికి పోలీసులు తోడుకావడంతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా ఆరోపించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరు పర్యటనను అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేశారని, అయినా ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి జగన్‌పై ఉన్న అభిమానాన్ని చాటారన్నారు. మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చూడటానికి వచ్చే ప్రజలకు పోలీసులు ఆంక్షలు విధించడం సరికాదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను, అసమర్థతను ప్రశ్నించే వారిపై కూటమి సర్కార్ రెడ్‌బుక్ రాజ్యాంగంతో భయానక పరిస్థితి సృష్టిస్తోందన్నారు. ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మగా మారిన పోలీసులు ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు నమోదు చేయడం, జైలుకు పంపడం కర్తవ్యంగా పనిచేస్తే రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పుతాయన్నారు.