
బీసీ విద్యార్థులపై చిన్నచూపు
కర్నూలు (టౌన్) : బీసీ హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులపై కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, హాస్టళ్ల నిర్వహణను గాలికి వదిలేసిందని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర నాయుడు విమర్శించారు. మంగళవారం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్‌లోని సమావేశ హాలులో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. విద్యార్థులకు వడ్డించే మెనూ సక్రమంగా నిర్వహించడం లేదన్నారు. నీళ్ల చారు, రసంతో సరిపెడుతున్నారన్నారు. గత ప్రభుత్వంలో హాస్టళ్లు, పాఠశాలల నిర్వహణ ఉన్నతంగా ఉండేదన్నారు. ఇప్పుడు ఎక్కడా ఆపరిస్థితి లేదన్నారు. కూటమి సర్కారు ప్రజా సంక్షేమం పక్కన పెట్టి అక్రమ అరెస్టులు చేస్తూ రాష్ట్రంలో భయానక వాతావరణం కల్పిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో బీసీ విద్యార్థుల సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.
వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర నాయుడు