
సహకార సంఘాల బలోపేతానికి కృషి
● జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్
నంద్యాల: జిల్లాలో సహకార సంఘాల బలోపేతానికి కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని వీసీ హాల్‌లో జిల్లా కో–ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. జిల్లాలో 56 కో–ఆపరేటివ్ సొసైటీలను ఆర్థికంగా బలోపేతం చేసి మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా నాబార్డు, డీసీసీబీలు ఆర్థికంగా మద్దతు అందించాల్సిన అవసరం ఉందన్నా రు. మల్టీపర్పస్ ఫెసిలిటీస్ సెంటర్ గోడౌన్స్ రైతుల అవసరం మేరకు ఇవ్వాలన్నారు. జిల్లాలో పండిస్తున్న పంటలకు అనవసరంగా యూరియా వాడకూడదని, యూరి యా ఎక్కువగా వాడటం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఒక ఎకరాకు రెండు బ్యాగులు మాత్రమే యూరియా వాడాలని అధిక మోతాదులో వినియోగిస్తే పంట దిగుబడి తగ్గిపోవడంతో పాటు భూస్వారం నిర్వీర్యమవుతుందన్నారు. నానో యూరియా పిచికారీపై అవగాహన పెంచు కోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కో–ఆపరేటివ్ అధికారి రామాంజనేయులు, నాబార్డు డీడీఎం కార్తికేయ, డీసీసీబీ శివలీల తదితరులు పాల్గొన్నారు.