
మోడల్ స్కూల్ విద్యార్థికి అస్వస్థత
జూపాడుబంగ్లా: స్థానిక మోడల్‌స్కూల్‌లో మధ్యాహ్న భోజనం చేస్తూ విజయ్‌కైలాస్ అనే 8వ తరగతి విద్యార్థి అస్వస్థతకు గురయ్యాడు. విషయం తెలుసుకొన్న పాఠశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ సుభాకర్, పీఈటీ పద్మావతి, పాఠశాల విద్యార్థులు కైలాస్‌ను హుటా హుటినా కారులో ప్రాథమిక వైద్య కేంద్రానికి తరలించారు. పీహెచ్‌సీ వైద్యురాలు సభా అస్వస్థతకు గురైన విజయ్‌కై లాస్‌కు వైద్య పరీక్షలు చేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేస్తున్న విజయ్‌కై లాస్‌కు ఫిట్స్ రావటంతో తోటి విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న కై లాస్ తండ్రి చిన్నతిరుపాలు ఆసుపత్రికి చేరుకోవ డంతో మెరుగైన చికిత్స నిమి త్తం 108లో కర్నూలు ప్రభు త్వ వైద్యశాలకు తరలించారు.