
వైభవంగా గరుడ పంచమి వేడుకలు
ఆళ్లగడ్డ: అహోబిలం క్షేత్రంలో గరుడ పంచమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. గరుడ పంచమిని పురస్కరించుకుని మంగళవారం దిగువ అహోబిలంలో మూలమూర్తులు శ్రీ ప్రహ్లాదవరదస్వామి, అమృతవల్లీ అమ్మవార్లకు నిత్య పూజల అనంతరం ప్రత్యేక గరుడ పంచమి పూజలు చేపట్టారు. అనంతరం దేవాలయం ఎదురుగా ధ్వజ స్తంభం దగ్గర కొలువైన మూలమూర్తి గరుత్మంతుడికి వేద పండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా పంచామృతాలతో అభిషేకించి తిరుమంజనం సేవ నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి కార్యక్రమాన్ని ముగించారు. ప్రధానార్చకులు కిడాంబి వేణుగోపాలన్, మణియార్ సౌమ్యానారాయణ్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు.
ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
ఆత్మకూరు: అడవి బిడ్డలు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని డీఈఓ జనార్దన్‌రెడ్డి అన్నారు. బైర్లూటీ చెంచుగూడెంలో రూ.2.30 కోట్లతో నూతన గిరిజన బాలుర వసతిగృహ నిర్మాణానికి మంగళవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ చెంచు గిరిజన విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పట్టుదలతో లక్ష్యాన్ని చేరుకుని గూడేలకు మంచి పేరు తేవాలన్నారు. క్రమశిక్షణతో చదివి ఉన్నత ఉద్యోగాలు సాధించాలన్నారు. కార్యక్రమంలో ఆత్మకూరు ఎంఈఓ మేరీమార్గరేట్, సమగ్రశిక్ష ఈఈ శ్రీనివాసులు, సర్పంచ్ గురువమ్మ, ఏఈ శంకరయ్య, గిరిజన విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
పరిశుభ్రతపై అవగాహన కల్పించండి
కొత్తపల్లి: ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై వైద్య, ఆరోగ్య సిబ్బంది అవగాహన కల్పించాలని జిల్లా మలేరియా నివారణ అధికారి చంద్రశేఖర్ సూచించారు. మంగళవారం గువ్వలకుంట్ల గ్రామ ఎస్సీకాలనీలో డాక్టర్ మహమ్మద్ బేగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరాన్ని తనిఖీ చేశారు. అనంతరం కాలనీలో ఎక్కడైనా నీటికలుషితం జరిగిందా అని ఆరా తీశారు. కాలనీకి నీటి సఫరా అయ్యే బావినీటిని, చేతిపంపులు, ఇళ్లలోని నీటినిల్వ డ్రమ్ములు, తొట్టిలు, కాలనీ పరిసర ప్రాంతాలను, మురికి కుంటలను పరిశీలించారు. నీటిసరఫరా అయ్యే బావిని శుభ్రంచేయించి బ్లీచింగ్ పౌడర్ వేయాలన్నారు. నీటిని ఎక్కువరోజులు నిల్వ ఉంచకుండా, రోజుమరచిరోజు తొట్టిలు, డ్రమ్ములను శుభ్రం చేయించేలా ఆశాలు చూడాలన్నారు. గ్రామస్తులకు ఎక్కువగా టైఫాయిడ్ లక్షణాలు ఉన్నందును గ్రామంలో సరఫరా అయ్యే నీటిని పరీక్షలకు పంపించామన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున కాచిన నీటిని తాగాలని సూచించారు. ఆయన వెంట డిప్యూటీ ఎంపీడీఓ సుబ్బరావు, పంచాయతీ కార్యదర్శి చిన్నస్వామి, వైద్య, ఆరోగ్య సిబ్బంది ఉన్నారు.
కొత్తూరులో విజిలెన్స్ ఎస్పీ పూజలు
పాణ్యం: కొత్తూరు గ్రామంలో వెలసిన శ్రీవల్లి సుబ్రమణేశ్వర్యస్వామి ఆలయంలో ఉమ్మడి జిల్లా విజిలెన్స్ ఎస్పీ చాముండేశ్వరి పూజలు చేశారు. ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజ లు, అభిషేకాలు, అర్చనలు చేశారు. అనంతం ఆలయ మర్యాదలతో ఆమెకు శేషావస్త్రాలు, తీర్థప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు.

వైభవంగా గరుడ పంచమి వేడుకలు

వైభవంగా గరుడ పంచమి వేడుకలు

వైభవంగా గరుడ పంచమి వేడుకలు