
సబ్సిడీ విత్తనాలు మగ్గుతున్నాయ్
రుద్రవరం: చిత్రంలో సంచుల్లో కనిపిస్తున్నవి రుద్రవరం వ్యవసాయ కార్యాలయంలోని సబ్సిడీ కంది, మినుము విత్తనాలు. నెల రోజుల క్రితం ఇక్కడికి చేరుకున్నాయి. రోజూ.. రైతులు ఇక్కడికి వచ్చి సబ్సిడీ విత్తనాలు ఎప్పుడు పంపిణీ చేస్తారని అడగటం, అధికారులు మాత్రం రేపు..మాపు అంటూ జాప్యం చేస్తూ వచ్చారు. ఇప్పటికే ఖరీఫ్ ప్రారంభమై రెండు నెలలు కావస్తోంది. ఈ విత్తనాలు పంపిణీ చేసి ఉంటే పొలాల్లో మొలకెత్తి పంట పచ్చగా కళకళలాడేది. పంపిణీ చేయకపోవడంతో నెల రోజులుగా కుట్టేసిన సంచుల్లో 16 క్వింటాళ్ల కందులు, 20 క్వింటాళ్ల మినుములు మగ్గిపోతున్నాయి. రోజూ కార్యాలయం తలుపులు తెరుస్తున్నారు.. అధికారులు వస్తున్నారు.. రైతులు విత్తనాలు ఇంకెప్పుడిస్తారని అని అడుగుతున్నారు.. అయినా విత్తనాలు గేటు దాటని పరిస్థితి నెలకొంది. ఓ ప్రజా ప్రతినిధి చేతుల మీదుగా రైతులకు పంపిణీ చేయాలని స్థానిక అధికారులు, నేతలు భావించారు. అయితే ఇప్పుడు.. అప్పుడు అంటూ కాలయాపన కావడంతో పుణ్యకాలం గడిచిపోయింది. విత్తనం అదును దాటిపోయిందని, రబీ సీజన్‌లో భాగంగా సెప్టెంబర్ నెలలో పంపిణీ చేసే అవకాశం ఉందని అధికారుల ద్వారా తెలుస్తోంది.

సబ్సిడీ విత్తనాలు మగ్గుతున్నాయ్

సబ్సిడీ విత్తనాలు మగ్గుతున్నాయ్

సబ్సిడీ విత్తనాలు మగ్గుతున్నాయ్