
కేంద్ర పథకాలను పటిష్టంగా అమలు చేయాలి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: కేంద్ర ప్రభుత్వ పథకాలను పటిష్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పనుల పరిశీలనకు వచ్చిన జాతీయ స్థాయి పర్యవేక్షణ కేంద్ర బృందం, జిల్లా అధికారులతో కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సంతోష్ ఫరీదా ఆధ్వర్యంలో కేంద్ర బృందం ఈనెల 19 నుంచి 29 వరకు జిల్లాలో పర్యటించిందన్నారు. ఉయ్యాలవాడ, జూపాడుబంగ్లా, నంద్యాల మండలంలోని పాంపల్లి, గోవిందపల్లి, జంబులదిన్నె, పారుమంచాల, జూపాడుబంగ్లా, లింగందిన్నె, భీమవరం, బిల్లలాపురం గ్రామపంచాయతీలు సందర్శించి వివిధ కేంద్ర పథకాల కింద అమలవుతున్న పనులను పరిశీలించిందన్నారు. పర్యటనలో గుర్తించిన విధానపరమైన అంశాలను బృందం సభ్యులు సంబంధిత శాఖల అధికారులతో కూలంకషంగా చర్చించారన్నారు. పలు అంశాలలో తీసుకోవాల్సిన చర్యలు, చేపట్టాల్సిన పనులపై పలు సలహాలు, సూచనలు ఇచ్చారన్నారు. సమావేశంలో ఎన్‌ఎల్‌ఎం సభ్యులు సూర్య ప్రదాన్, డ్వామా పీడీ సూర్యనారాయణ, అధికారులు పాల్గొన్నారు.