
చెంచులకు మెరుగైన వైద్యసేవలు
కొత్తపల్లి/ఆత్మకూరు: గిరిజన గూడేల్లోని చెంచులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి వెంకటరమణ సూచించారు. శుక్రవారం కొత్తపల్లి మండలంలో కొత్తపల్లి, శివపురం, ఆత్మకూరు మండలంలోని బైర్లూటీ పీహెచ్‌సీలను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. శివపురం చెంచుగూడెంలో 104 సంచార చికిత్సను సందర్శించి, ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా చెంచు మహిళలతో వైద్య సేవల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు. బైర్లూటీ పీహెచ్‌సీలో వైద్యసిబ్బంది సమయపాలన పాటించడం లేదని, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏబీహెచ్‌ఏ ఐడీ జనరేషన్, పీఎంజేఏవై పథకాల లబ్ధిదారులకు అన్నీ వైద్యసేవలు అందించాలన్నారు. ఆయన వెంట వైద్యాధికారులు దీపా నాగవేణి, మహమ్మద్ బేగ్, జబ్బీర్, విజయేంద్ర, జుబేదా, వైద్య సిబ్బంది ఉన్నారు.
జిల్లా వైద్యాధికారి వెంకటరమణ