
ఉరుకుందలో ‘నవో’దయం
కౌతాళం: జిల్లాలో ప్రసిద్ధి చెందిన ఉరుకుంద ఈరన్నస్వామి దేవాలయంలో శుక్రవారం నుంచి శ్రావణ మాస ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేప థ్యంలో దేవాలయంలో గురువారం ప్రత్యేకంగా 9 వారాలు.. 9 ప్రదక్షిణల కార్యక్రమానికి శ్రీకారం చుట్టా రు. భక్తులు స్వామి వారికి 9 వారాల మొక్కు చెల్లించుకోవచ్చు. ఆలయ డిప్యూటీ కమిషనర్ విజయరాజు ఆధ్వర్యంలో లక్షపుష్పార్చన కార్యక్రమాన్ని చేపట్టారు. గురువారం అమావాస్య, ఆషాఢ మాసం చివరి రోజు కావడంతో మహాలక్ష్మి అమ్మవారికి భక్తులు శాస్త్రోకంగా సారెను సమర్పించారు. పిండివంటలతో స్వామికి నైవేద్యం సమర్పించారు. భక్తుల సౌకార్యర్థం ఆదోని, ఎమ్మిగనూరు, కర్ణాటకలోని రాయచూరు, శిరుగుప్ప ఆర్టీసీ డిపోలవారు ప్రత్యేక బస్సులను నడిపారు.
ప్రారంభమైన 9 వారాలు.. 9 ప్రదక్షిణలు