
అవ్వ ఇంటికి వెళ్లిన అధికారులు
చాగలమర్రి: పింఛన్ అందక భిక్షాటన చేస్తున్న ఏనభై ఏళ్ల వయస్సు పైబడిన చిన్న గంగమ్మ అవ్వ ఇంటికి అధికారులు వెళ్లారు. అవ్వకు పింఛన్ ఇచ్చేందుకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు తీసుకెళ్లారు. అలాగే జిల్లా కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. ‘పింఛన్ అందక భిక్షాటన ’అనే శీర్షికన బుధవారం సాక్షి దినపత్రికలో వార్త ప్రచురితం కావడంతో జిల్లా కలెక్టర్ రాజకుమారి స్పందించారు. చాగలమర్రి ఎంపీడీఓ రాజేంద్రప్రసాద్‌కు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దీంతో అప్రమత్తమైన ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది చాగలమర్రిలోని ఎస్‌టీ కాలనీలోని గుడిసెలో నివాసముంటున్న చిన్న గంగమ్మ వద్దకు వెళ్లారు. సమాచారం సేకరించి నివేదికను జిల్లా కలెక్టర్‌కు పంపారు.