
ప్రొబేషనరీ సబ్ ఇన్‌స్పెక్టర్ల నియామకం
నంద్యాల: కర్నూలు 2వ బెటాలియన్‌లో బేసిక్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ప్రొబేషనరీ సబ్‌ఇన్‌స్పెక్టర్లు రవిప్రకాష్, ధనుంజయుడు, ఎ.శ్రీకాంత్, ఈ. అనిల్‌కుమార్‌ను జిల్లాకు నియమించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణాను వీరు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్‌లలో వీరికి స్థానం కల్పిస్తామని ఎస్పీ తెలిపారు.
‘మినీ అంగన్‌వాడీ’
నోటిఫికేషన్ రద్దు
నంద్యాల(అర్బన్): బనగానపల్లె, నందికొట్కూరు ప్రాజెక్టుల పరిఽధిలో ప్రకటించిన మినీ అంగన్‌వాడీ కార్యకర్తలకు సంబంధించి గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రభుత్వ ఆదేశానుసారం రద్దు పరిచామని జిల్లా సీ్త్ర శిశుసంక్షేమం సాధికార అధికారిణి లీలావతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఆరు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని మెయిన్, మినీ అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాల నియామకాలకు అర్హులైన సీ్త్ర అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. గతంలో వెలువడిన నోటిఫికేషన్‌లో చూపిన ఖాళీలతో పాటు అదనంగా ఏర్పడిన మొత్తం 40 అంగన్‌వాడీ సహాయకుల పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నామన్నారు. ఈనెల 31లోగా దరఖాస్తులు సంబంధిత కార్యాలయంలో అందజేయాలని, మరిన్ని వివరాలకు నంద్యాలలోని శిశు అభివృద్ధి పథకం అధికారి కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
కేసీ కాల్వకు తగ్గిన నీటిసరఫరా
జూపాడుబంగ్లా: కేసీ కాల్వకు నీటిసరఫరా తగ్గించటంతో ఏబీఆర్ కాల్వకు సాగు నీటిసరఫరా నిలిపివేసినట్లు ఏఈ కేసీ కాల్వ ఏఈ శ్రీనివాసనాయక్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సుంకేసుల డ్యాం నుంచి కేసీ కాల్వకు వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా రైతుల వినియోగానంతరం లాకిన్స్‌లా కు 500క్యూసెక్కుల నీరు చేరుతున్నట్లు తెలిపారు. అందులో 300 క్యూసెక్కులు నిప్పులవాగుకు 200క్యూసెక్కులు తూడిచెర్ల సబ్‌ఛానల్ కాల్వకు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కాల్వకు నీటిసరఫరా నిలిపివేసినట్లు తెలిపారు.
రిటైర్డ్ కమర్షియల్ ట్యాక్స్ అధికారి అక్రమ వసూళ్లు
ప్యాపిలి: పదవీ విరమణ పొందిన కమర్షియల్ ట్యాక్స్ అధికారి సుబ్బరాయుడు అక్రమ వసూళ్ల బాగోతం బయటపడింది. పట్టణ సమీపంలోని 44 వ నంబర్ జాతీయ రహదారిపై డోన్ మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ క్రాంతి కుమార్ వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో క్రెటా కారును రోడ్డు పక్కన నిలబెట్టిన ముగ్గురు వ్యక్తులు ఓ గ్రానైట్ లారీని తనిఖీ చేస్తున్న విషయాన్ని మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ గమనించారు. తాము అనంతపురం జిల్లాకు చెందిన కమర్షియల్ ట్యాక్స్ అధికారులమని సుబ్బరాయుడు, అతని కుమారుడు సురేశ్, మరో వ్యక్తి ఎంవీఐని నమ్మించారు. కొద్ది సేపటికి వారు అక్కడి నుంచి జారుకున్నారు. అనంతరం గ్రానైట్ లారీ డ్రైవర్‌ను ఎంవీఐ ఈ విషయమై ప్రశ్నించగా తనను డబ్బులు ఇవ్వాల్సిందిగా వారు డిమాండ్ చేసినట్లు తెలిపారు. దీంతో అనుమానం వచ్చిన ఎంవీఐ నిందితుల కారును వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. వారు చెప్పే సమాధానాల్లో పొంతన లేకపోవడంతో ఎంవీఐ వారిని ప్యాపిలి పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుల కారు ఏపీ 40ఈఆర్ 8925 ను సీజ్ చేసి నిందితులపై కేసు నమోదు చేశారు.

ప్రొబేషనరీ సబ్ ఇన్‌స్పెక్టర్ల నియామకం

ప్రొబేషనరీ సబ్ ఇన్‌స్పెక్టర్ల నియామకం