ప్రతి ఇంట్లో ఆయన నామమే | - | Sakshi
Sakshi News home page

ప్రతి ఇంట్లో ఆయన నామమే

Jul 24 2025 7:26 AM | Updated on Jul 24 2025 7:44 AM

ఆలయంపై ప్రత్యేక కథనం

ఆలయానికి సంబంధించి ప లు కథనాలు ప్రచారంలో ఉండగా చారిత్రక ఆధారాలు ఏవీ లభించ లేదు. స్వామి కి నిర్ధిష్టమైన ఆకారం లేదు. ఒక సిద్ధ పురషుడని, వీరభద్ర అంశంతో భూలోకానికి వచ్చిన దైవదూతగా పెద్దలు చెబుతారు. 16వ శతాబ్ధంలో ఈరన్న అనే సిద్ధయోగి ఉరుకుందకు వచ్చి రావి చెట్టు కింద లక్ష్మినరసింహ స్వామి కొరకు తపస్సు చేసి ఆ రావి చెట్టులో స్వామి ఐకమయ్యారని ప్రతీతి. ఈ చెట్టు చుట్టూ కట్టను నిర్మించారు. స్వామి ఇప్పటికీ రాత్రివేళ సర్ప రూపంలో, సాధువు రూపంలో సంచరిస్తుంటారని భక్తులు విశ్వసిస్తున్నారు. స్వామిపై విశ్వాసం ఉంచే వారికి అన్నీ శుభాలే జరుగుతాయని నమ్ముతారు. ఇక్కడ మతపరమైన భేదాలు లేవు. హిందువులే కాక ముస్లింలు కూడా స్వామి వారి దర్శనార్థం వస్తుంటారు. పిలిస్తే పలికే ఈరన్నగా, కోరిన కోర్కెలు తీర్చే లక్ష్మి నరసింహగా భక్తులు స్వామిని పూజిస్తారు. ఒక్కసారి స్వామి దర్శనార్థం వస్తే 9 సార్లు 9 ప్రదక్షిణలతో స్వామి దర్శనం చేయాలని ప్రతీతి. భక్తి ప్రవుత్తులతో స్వామివారి ఆలయ ప్రాంగణంలో నైవేద్యం సమర్పించటం ఆచారం.

స్వామి ఆశ్రయం పొందిన గ్రామంతో పాటు పరిసర గ్రామాల్లో ఏ ఇంటికి వెళ్లినా స్వామి నామమే. ప్రజలందరి పేర్లు ఈరన్న, ఈరమ్మ, నాగరాజు, నాగమ్మ, వీరేష్‌, వీరన్న ఇలా వినిపిస్తాయి. తమ పిల్లలకు స్వామి పేరు పెట్టడం వల్ల అంతా శుభం జరుగుతుందని భక్తులు భావిస్తున్నారు.

శ్రావణ మాస ఉత్సవాలకు

ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

కౌతాళం: ఉరుకుంద ఈరన్న (నరసింహ) స్వామి క్షేత్రం భక్తజనుల పుణ్యదామంగా నిత్యం పూజలందుకుంటూ మహాక్షేత్రంగా వెలుగొందుతోంది. మహిమాన్వితుడైన ఈరన్న స్వామిని మనసా, వాచా కొలిస్తే అంతా శుభమే జరుగుతుందనే నమ్మకం భక్తుల్లో ఉంది. స్వామి వారి పాదాలను తాకితే సర్వపాపాలు హరించి ముక్తి మార్గం సంప్రాప్తిస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. కౌతాళం మండల కేంద్రానికి 6 కి.మీ. దూరంలో ఉరుకుంద గ్రామంలో వెలసిన క్షేత్రమే ఈరన్న (నరసింహ) స్వామి పుణ్యక్షేత్రం. ఇక్కడ స్వామి వారు మహిమాన్వితుడిగా వెలుగొందుతూ నిత్యం పూజలందుకుంటున్నారు. రోజూ వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామి దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు ఈ నెల 25 నుంచి ప్రారంభమై ఆగస్టు 23వ తేదీ వరకు జరుగుతాయి. ఉత్సవాల్లో భాగంగా సోమ, గురువారాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. మూడవ సోమవారం దాదాపు 3 లక్షలకు పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారు. చివరి సోమవారం స్వామివారి పల్లకోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఉత్సవాలు ుుగిసే వరకు ఈ ప్రాంతవాసులు మద్యపానానికి, ూంసాహారానికి దూరంగా ఉంటారు.

నిత్యాన్నదానం

ఆలయం వద్ద నిత్యాన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఎంతమంది భక్తులు వచ్చినా ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమం నిర్వహణకు ప్రత్యేక భవనా న్ని విశాలమైన ప్రదేశంలో నిర్మించారు. జీప్లస్‌ భవ న నిర్మాణం కోసం రూ.2.30 కోట్లతో ప్రతిపాదన లు పంపారు. మధ్యాహ్నం, రాత్రి వేళలోనూ భక్తులకు అన్నదానం చేస్తారు. శ్రావణ మాసంలో భక్తుల కోసం మూడు చోట్ల అన్నదానం చేయనున్నట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్‌ విజయరాజు తెలిపారు.

స్వామి వారి ఆదాయం

భక్తులు పలు రూపాల్లో స్వామివారికి కానుకలు సమర్పిస్తుంటారు. నిత్యాన్నదానం పథకానికి రూ.6 కోట్ల వరకు డిపాజిట్లు ఉన్నట్లు డీసీ తెలిపారు. అలాగే 3.50 కేజీ బంగారం గోల్డ్‌బాండ్‌ల రూపంలో ఉందని, 2 కేజీల వరకు భక్తులు ఇచ్చిన బంగారం కానుకల రూపంలో ఉందన్నారు. వెండి 1400 కేజీలు బ్యాంక్‌ లాకర్‌లో ఉందని, 750 కేజీల వరకు కానుకల రూపంలో దేవాలయంలో ఉందని డీసీ తెలిపారు.

రవాణా సౌకర్యం

ఆదోని, ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపోలతో పాటు కర్ణాటకలోని బళ్లారి, శిరుగుప్ప, రాయచూరు, సింధనూరు ఆర్టీసీ వారు ఉరుకుంద ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక బస్సులు నడుపుతారు. ఆదోని, ఎమ్మిగనూరుకు చేరుకున్న భక్తులకు అక్కడి నుంచి ఉరుకుందకు వెళ్లేందుకు బస్సులు సిద్ధంగా ఉంటాయి.

దర్శనీయ స్థలాలు

స్వామిని దర్శించుకున్న భక్తులు ఆలయం వెనుక ఉన్న ఆంజనేయ స్వామి, నాగుల స్వామి, బసవన్న కట్టను దర్శించుకోవడం ఆనవాయితీ. ఉరుకుంద నుంచి 5 కి.మీ. దూరంలో పలికే దేవుడిగా పేరుగాంచిన బుడుములదొడ్డి ఆంజనేయస్వామి దేవస్థానం ఉంది. ఉరుకుందకు 15 కి.మీ దూరంలో మేళిగనూరు వద్ద శ్రీరాముని చేత ప్రతిష్టించబడిన రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. అలాగే 40 కి.మీ. దూరంలో మంత్రాలయం మఠం ఉంది.

నీటి సదుపాయం

తుంగభద్ర దిగువ కాలువ పరిధిలోని మాధవరం మేజర్‌ కాలువ ఆలయం సమీపంలోనే ప్రవహిస్తుంది. ఈసారి ఉత్సవాల ప్రారంభానికి ముందే తుంగభద్ర డ్యాం నిండటంతో దిగువ కాలువకు సాగు నీరు విడుదల చేశారు. దీంతో భక్తులకు నీటి కష్టా లు తప్పాయి. దీనికితోడు మొదటిసారిగా ఫిల్టర్‌ చే సిన తాగునీరు ఏర్పాటు చేశారు. ఆలయం లోపల, వెలుపల తాగునీటి కుళాయిలను ఏర్పాటు చేశారు.

రేపటి నుంచి శ్రావణమాస ఉత్సవాలు

ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

మాస్టర్‌ ప్లాన్‌ ఆధారంగా అభివృద్ధి పనులు

మాస్టర్‌ప్లాన్‌ ఆధారంగా ఇక్కడ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు డిప్యూటీ కమిషనర్‌ వివరించారు. ఆలయం చుట్టూ సీసీ రాతిపరుపు, తూర్పు రాజగోపురం ముందు భాగంలో సీసీ ఫ్లోరింగ్‌, ప్రాంగణంలో నాల్గు ఐ మాక్స్‌ లైట్ల ఏర్పాటు, నూతనంగా 24 టాయిలెట్ల నిర్మాణం, సెంట్రల్‌ స్టోర్‌ నిర్మాణం, ఆలయం చుట్టూ కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణం, దేవస్థానం కార్యక్రమ వివరాలు తెలిసేలా బోర్డుల ఏర్పాటు, గోశాల విస్తరణ, నూతన సేవ టికెట్స్‌, లడ్డూ కౌంటర్‌ బుకింగ్‌ కౌంటర్లు, భక్తుల సౌకర్యార్థం వీఐపీ లాంజ్‌ ఒకేసారి వెయ్యి మంది భక్తులు సేద తీరే విధంగా 2 పెద్ద షెడ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తి చేశామని తుంగభద్ర కాలువ వద్ద బళ్లారికి చెందిన భక్తుడు తిప్పయ్య ఇచ్చిన 1.11 ఎకరాల స్థలంలో డార్మింటరీహాల్‌, కళ్యాణకట్ట, టాయిలెట్స్‌ నిర్మాణ పనులు జరుగుతున్నట్లు డీసీ తెలిపారు. అలాగే ఇటీవల సుమారు రెండు కోట్లతో కోనేరు నిర్మాణానికి బెంగళూరుకు చెందిన భక్తుడు మంజునాథ్‌ ముందుకు రావడంతో భూమిపూజ చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.

ప్రతి ఇంట్లో ఆయన నామమే1
1/7

ప్రతి ఇంట్లో ఆయన నామమే

ప్రతి ఇంట్లో ఆయన నామమే2
2/7

ప్రతి ఇంట్లో ఆయన నామమే

ప్రతి ఇంట్లో ఆయన నామమే3
3/7

ప్రతి ఇంట్లో ఆయన నామమే

ప్రతి ఇంట్లో ఆయన నామమే4
4/7

ప్రతి ఇంట్లో ఆయన నామమే

ప్రతి ఇంట్లో ఆయన నామమే5
5/7

ప్రతి ఇంట్లో ఆయన నామమే

ప్రతి ఇంట్లో ఆయన నామమే6
6/7

ప్రతి ఇంట్లో ఆయన నామమే

ప్రతి ఇంట్లో ఆయన నామమే7
7/7

ప్రతి ఇంట్లో ఆయన నామమే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement