
నకిలీ ఏపీకే ఫైల్స్‌తో జాగ్రత్త
కర్నూలు(హాస్పిటల్): ఈ–చలాన్ పేరుతో వస్తున్న నకిలీ ఏపీకే ఫైల్స్‌తో జాగ్రత్తగా ఉండాలని, తొందరపడి వాటిని క్లిక్ చేయవద్దని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సామాజిక మాద్యమాల్లో ఆర్‌టీఓ ట్రాఫిక్ చలాన్.ఏపీకే పేరుతో వచ్చే లింక్‌ను నమ్మవద్ద న్నారు. నకిలీ ఏపీకే ఫైల్స్ క్లిక్ చేస్తే సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతారని, మీ డబ్బును దోచేస్తా రని చెప్పారు. ఇదివరకు పీఎం కిసాన్ యోజన, ఎస్‌బీ ఐ క్రెడిట్ కార్డులు, రివార్డులు, కేవైసీ అప్‌డేట్ పేర్లతో సైబర్ మోసాలకు పాల్పడే నేరగాళ్లు నూతన ఎత్తుగడ కు పథకం వేసి ట్రాఫిక్ చలానా పేరుతో ప్రజల బ్యాంకు ఖాతాల్లోని డబ్బులను లూటీ చేసేందుకు సిద్ధమయ్యారని, దీనిపై అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఈ–చలాన్ పేరున నేరం ఇలా...
ముందుగా నకిలీ ఏపీకే ఫైల్‌ను నమ్మదగిన వాట్సాప్ గ్రూపులలో షేర్ చేస్తారు. ఆ గ్రూపులో ఉన్న సభ్యులు దాన్ని నమ్మి ఆలోచించకుండా క్లిక్ చేసి ఇన్‌స్టాల్ చేసుకుంటారు. వెంటనే మీ అనుమతి లేకుండా క్రెడిట్ కార్డు నుంచి ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు జరిగినట్లు మెసేజ్‌లు వస్తాయని ఎస్పీ వివరించారు. ఏపీకే ఫైల్‌ను ఇన్‌స్టాల్ చేస్తే అది మీ ఎస్‌ఎంఎస్‌లను యా క్సెస్ చేసి ఓటీపీలను తెలుసుకుంటుందన్నా రు. మీ బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ కార్డు వివరాలను కూడా తెలుసుకుంటుందని, మీ ఫోన్‌ను ఓ రిమోట్ మాదిరిగా సైబర్ నేరగాళ్లు నియంత్రిస్తారన్నా రు. గుర్తు తెలియని, అనధికార లింక్‌లను క్లిక్ చేయరాదని, యాప్స్‌ను ఎల్లప్పుడూ గూగుల్ ప్లే స్టోర్ నుంచే డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు.ఓటీపీ అలర్ట్స్‌ను ఎనేబు ల్ చేసుకోవాలని, ఏవైనా అనుమతి లేకుండా లావాదే వీలు జరిగినట్లు అనుమానాస్పదంగా అనిపిస్తే వెంట నే కార్డును బ్లాక్ చేయాలన్నారు.సైబర్ నేరాల పట్ల 1930 ఫోన్ నంబర్ లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.