
ఆక్సిజన్ లీక్‌తో గందరగోళం
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో బుధవారం పైపుల ద్వారా వెళ్లే ఆక్సిజన్ లీకై ంది. సూపర్ స్పెషాలిటీ భవనంలో ఉదయం 10.30 గంటల సమయంలో ఆక్సిజన్ పైపులైన్‌పై కోతులు ఊగిసలాడటంతో పెద్ద శబ్దంతో రంధ్రం పడింది. రంధ్రం నుంచి ఆక్సిజన్ లీకై ంది. ఆ ధాటికి పైపునకు ఆనుకుని ఉన్న ఇనుప మెట్లకు కన్నం పడింది. విషయం తెలుసుకున్న సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు మరమ్మతు చర్యలు ప్రారంభించారు. ఇన్‌చార్జ్ సీఎస్‌ఆర్‌ఎంఓ డాక్టర్ వెంకటరమణ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్లు డాక్టర్ శివబాల నాగాంజన్, డాక్టర్ కిరణ్‌కుమార్ సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి దెబ్బతిన్న పైపులైన్‌కు ఆక్సిజన్ సరఫరా నిలిపివేశారు. వెల్లింగ్ చేసి పైపులైన్‌ను సరి చేశారు. ఆ సమయంలో రోగులకు సిలిండర్ల ద్వారా ఆక్సిజన్ అందించారు. ఆసుపత్రిలో కోతుల బెడద కారణంగా రెండు నెలల క్రితం చిన్నపిల్లల విభాగంలో ఆక్సిజన్ పైపులైన్ లీకై ంది. అప్పుడు కూడా ఎక్కువ శాతం ఆక్సిజన్ వృథాగా పోయింది. ప్రస్తుతం జరిగిన సంఘటనతో రోగులకు ఇబ్బంది రాకపోవడంతో అధికారులతో పాటు ఉద్యోగులు ఊపిరిపీల్చుకున్నారు.