
బ్యాంకుకు వెళ్లి వస్తానని వివాహిత అదృశ్యం
ఆలూరు: మండలంలోని మొలగవెల్లి గ్రామంలో పొదుపు సంఘాల బుక్ కీపర్‌గా పనిచేస్తున్న కుమ్మరి రాజేశ్వరి (27) బ్యాంకుకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లి అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపిన వివరాల మేరకు.. ఈ నెల 7వ తేదీన కుమ్మరి రాజేశ్వరి బడికి వెళ్లి పిల్లలకు అన్నం తినిపించి, అలాగే బ్యాంకుకు వెళ్లి వస్తానని కుటుంబసభ్యులకు చెప్పి వెళ్లింది. తర్వాత ఇంటికి తిరిగి రాకపోవడంతో ఈ నెల 8న ఆమె భర్త కుమ్మరి ఆదినారాయణ ఆలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు పెద్దగా స్పందించకపోవడంతో బుధవారం ఆలూరు సీఐ రవిశంకర్‌రెడ్డిని కలిసి విషయం తెలియజేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. స్థానిక ఎస్‌బీఐ బ్రాంచ్ మేనేజర్ రామచంద్రయ్యపై అనుమానం ఉందని పేర్కొనడంతో పోలీసులు ఆయన్ను స్టేషన్‌కు పిలిపించి విచారణ జరిపారు. అలాగే అనంతపురం జిల్లా గుంతకల్లులోని హోటల్, మద్దికెరలోని ఇంటికి కూడా తీసుకెళ్లి విచారణ చేశారు. కుమ్మరి రాజేశ్వరి ఆచూకీ తెలిసిన వారు ఆలూరు సీఐ నంబర్ 91211 01157 లేదా ఎస్‌ఐ 91211 01158 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.