
వ్యాపారం మానుకోవాల్సిందే
కోడుమూరుకు చెందిన శ్రీనివాసులుకు బండల వ్యాపారం ఉండడంతో బండల కటింగ్ మిషన్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. గతంలో ఐదారువేలకు మించి రాని కరెంట్ బిల్లు స్మార్ట్ మీటర్ ఏర్పాటుతో జూన్ నెల రూ.14750లు వచ్చింది. దీంతో అప్పు చేసి గత నెల వచ్చిన కరెంట్ బిల్లును ఎలాగోలా కట్టుకున్నాడు. అయితే జూలై నెల ఏకంగా రూ.19993ల కరెంట్ బిల్లు రావడంతో బెంబేలెత్తిపోతున్నాడు. ఇప్పటికే వ్యాపారాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే భారీగా వస్తున్న కరెంట్ బిల్లులను చూసి చేస్తున్న వ్యాపారం మానుకునే ఆలోచన చేస్తున్నానంటూ శ్రీనివాసులు వాపోయాడు.