
బిల్లు కట్టాలంటే షాపును అమ్ముకోవాల్సిందే
కోడుమూరుకు చెందిన నాగేంద్ర ఆచారి కార్పెంటర్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మే నెలలో కార్పెంట్ షాపునకు అధికారులు పాత మీటర్‌ను తొలగించి స్మార్ట్ మీటర్‌ను ఏర్పాటు చేశారు. గతంలో ఎప్పుడూ కార్పెంటర్ షాపునకు రూ.800లు మించి రాని కరెంట్ బిల్లు స్మార్ట్ మీటర్ ఏర్పాటు చేసిన 15 రోజులకే ఏకంగా రూ.18570 బిల్లు వచ్చింది. ఈ బిల్లును చూసిన నాగేంద్ర ఆచారి ఇంత కరెంట్ నేను ఎక్కడ కాల్చానో చెప్పి కరెంట్ బిల్లు కట్టించుకోవాలంటూ విద్యుత్ అధికారులకు మొరపెట్టుకున్నాడు. అయితే నాగేంద్ర ఆచారి సమస్యను పరిష్కరించని విద్యుత్ అధికారులు పాత బిల్లు కలుపుకుని (కొత్త బిల్లు రూ.7995లు) ఏకంగా రూ.25,565ల బిల్లును వేశారు. దీంతో బెంబేలెత్తిపోయిన నాగేంద్ర ఆచారి ఇంతింత కరెంట్ బిల్లులు కట్టాలంటే తాను షాపును అమ్ముకోవాల్సిందేనంటూ వాపోతున్నాడు.