నవోదయ విద్యాలయంలో అ‘పూర్వ’ సేవలు | - | Sakshi
Sakshi News home page

నవోదయ విద్యాలయంలో అ‘పూర్వ’ సేవలు

Jul 21 2025 5:15 AM | Updated on Jul 21 2025 5:15 AM

నవోదయ

నవోదయ విద్యాలయంలో అ‘పూర్వ’ సేవలు

వంద సేవా కార్యక్రమాలు చేశాం

నేను నవోదయ విద్యాలయం ప్రారంభించిన 1987 మొదటి బ్యాచ్‌ విద్యార్థిని. పూర్వపు విద్యార్థులు ఒక ట్రస్ట్‌గా ఏర్పడి ఇప్పటి వరకు 100 సేవా కార్యక్రమాలు చేపట్టాం. విద్యాలయాని కి సోలార్‌ వాటర్‌ను ఇవ్వటం, విద్యాలయంలో బాగా చదువుతున్న పేదవిద్యార్థులకు ఆర్థిక సాయం కూడా చేశాం. ఈ విద్యాలయంలో చదువుకోవటం వల్లే మేం ఈ స్థాయిలో ఉన్నాం. – ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌,

జిల్లా జడ్జి రాజంపేట, అన్నమయ్య జిల్లా

ఏమి కావాలన్నా చేస్తాం

పూర్వపు విద్యార్థులందరూ విద్యాలయం అభివృద్ధికి సహకరిస్తున్నారు. నేను 7వ బ్యాచ్‌ కు చెందిన విద్యార్థిని. మొదటి నుంచి చదువుకున్న పూర్వపు విద్యార్థులు 200 మంది దాకా వచ్చి వైద్య శిబిరాన్ని నిర్వహించాం. ట్రస్ట్‌ ద్వారా ఏమి కావాలన్నా చేస్తాం. – నాగరాజు,

డిప్యూటీ కమిషనర్‌(ఐఎస్‌ఆర్‌), హైదరాబాద్‌

చాలా సంతోషం

విద్యాలయంలో చదువుకున్న వారంతా ట్రస్ట్‌గా ఏర్పడి సేవలకు ముందుకు రావటం చాలా సంతోషంగా ఉంది. నేను 7వ బ్యాచ్‌కు చెందిన విద్యార్థిని. కర్నూల్‌లో కిడ్నీ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నాను. నా భర్త డాక్టర్‌ రవీంద్ర క్యాన్సర్‌ వైద్య నిపుణులుగా ఉన్నారు. విద్యాలయంలో క్యాన్సర్‌కు సంబంధించిన వ్యాక్సిన్‌ను ఉచితంగా విద్యార్థులకు ఇచ్చాం. 9 నుంచి 16 సంవత్సరాల పిల్లలకు ఈ వ్యాక్సిన్‌ వేసుకోవచ్చు.

– డా.సాయివాణి, ఎండీ, డీఎం, నెప్రాలజీ

ఎమ్మిగనూరురూరల్‌: తమను ఉన్నత స్థాయికి తెచ్చిన బనవాసి జవహర్‌ నవోదయ విద్యాలయం అభివృద్ధికి పూర్వ విద్యార్థులు చేయూత ఇస్తున్నారు. 2014 సంవత్సరం నుంచి అల్యూమినియం వెల్ఫేర్‌ అండ్‌ ట్రస్ట్‌ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్యాలయంలో స్టాచీవ్‌ ఏర్పాటు చేశారు. అలాగే పార్కును అభివృద్ధి చేశారు. ఆదివారం మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి 1987 మొదటి బ్యాచ్‌ నుంచి 2020 వరకు చదివిన 200 మంది పూర్వపు విద్యార్థులు హాజరయ్యారు. రక్తదానం చేసి సేవాభావాన్ని చాటుకున్నారు. పూర్వపు విద్యార్థులను విద్యాలయ ప్రిన్సిపాల్‌ ఇ. పద్మావతి అభినందించారు. అలాగే పూర్వపు విద్యార్థులు ప్రిన్సిపాల్‌ను సన్మానించారు.

నవోదయ విద్యాలయంలో అ‘పూర్వ’ సేవలు1
1/3

నవోదయ విద్యాలయంలో అ‘పూర్వ’ సేవలు

నవోదయ విద్యాలయంలో అ‘పూర్వ’ సేవలు2
2/3

నవోదయ విద్యాలయంలో అ‘పూర్వ’ సేవలు

నవోదయ విద్యాలయంలో అ‘పూర్వ’ సేవలు3
3/3

నవోదయ విద్యాలయంలో అ‘పూర్వ’ సేవలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement