
రేషన్ బండి పాయే..టిఫిన్ బండి వచ్చే!
పత్తికొండ రూరల్: గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేసేందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రేషన్‌బండ్లు కూటమి ప్రభుత్వం కక్షసాధింపుతో మాయమయ్యాయి. పత్తికొండలోని ఓ రేషన్ బండి ఇలా టిఫిన్ బండిగా మారిపోయింది. గత ప్రభుత్వంలో ఇంటింటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్న వలంటీరు మాబు బండిలో ఇడ్లీ, పూరి, ఉగ్గాని, బజ్జి, దోసెలు విక్రయిస్తున్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన ఈబండిని చూసి ప్రజలు గత ప్రభుత్వ హయాంలో అందిన సేవలు గుర్తుచేసుకుంటూ నేడు అధికార కూటమి ప్రభుత్వ దుర్మార్గాలను చీదరించుకుంటున్నారు.