
కౌలు రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం అంటూ గొప్పలు చెప్
గత ప్రభుత్వానికి
రుణపడి ఉంటా
నాకు సెంటు కూడా భూమి లేదు. పదేళ్లుగా పొలం కౌలుకు తీసుకుని పంటలు సాగు చేస్తున్నా. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పాలనలో సాధారణ రైతులతో పాటు ఏటా రూ. 13,500 చొప్పున రెండు సార్లు రూ. 27,000 వేలు రైతు భరోసా, రూ. 9 వేలు ఉచిత పంటల బీమా కూడా జమ అయ్యాయి. గత సంవత్సరం నుంచి ఏటా రెండెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటూ కౌలు కార్డు కోసం అధికారుల చుట్టు ఎన్నిసార్లు తిరిగినా స్పందించడం లేదు.
– ఓబన్న, క్రిష్టిపాడు
ఇప్పుడు ఇచ్చినా
ఉపయోగం లేదు
నేను 5 ఎకరాల మేర పొలం కౌలుకు తీసుకుని పూలతోటలు, వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నాను. గత నాలుగు సంవత్సరాలుగా జూన్ నెలలోనే కౌలు కార్డులు ఇవ్వడంతో బ్యాంకులో పంట రుణంతో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని రాయితీలు పొందాను. అయితే ఈ ఏడాది ఇప్పటి వరకు కౌలు కార్డు ఇవ్వలేదు. ఇప్పుడు ఇచ్చినా ఏం ప్రయోజనముండదు. సరిగ్గా సీజన్‌లో అవసరమైన రుణ పరపతి లభించక అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సి వస్తోంది.
– ఖాదర్ బాషా, చాగల్రమరి
ఆళ్లగడ్డ సమీపంలో పంటలు సాగు చేస్తున్న కౌలు రైతులు
ఆళ్లగడ్డ: ఖరీఫ్ ప్రారంభానికి ముందే (ఏప్రిల్, మే లోపే) సీసీఆర్సీ కార్డులు పంపిణీ చేయాల్సి ఉండగా ప్రభుత్వ నిర్లక్ష్యం.. అధికారుల సమన్వయ లోపంతో జిల్లాలో ఐదు శాతం కూడా పంపిణీ జరగలేదు. ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి భరోసాకు ఈ కార్డే అత్యంత ఆధారం. ఇంతటి ప్రాధాన్యమున్న ఈ కార్డుల జారీలో కౌలు దారుల గుర్తింపు ప్రక్రియ ఆందోళనకు గురి చేస్తోంది. సుమారు 4 నెలల నుంచి ఈ తంతును అధికారులు సాగదీస్తుండగా.. మరో నెల లోపు సాగు పనులు పూర్తిగా ముగుస్తాయి. సీజన్ దాటాక కార్డులు ఇచ్చినా ప్రయోజనం ఏమిటీ.. అని కౌలు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు కార్డు అందక.. ఇటు రుణం చేతికి చిక్కక ‘పాత కఽథే’ఈ ఖరీఫ్‌లో పునరావృతమవనుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఏరువాక (పంటల సీజన్) మొదలవ్వగానే కౌలు రైతుల గుర్తింపు కార్డుల పంపిణీకి సంబంధించి రెవెన్యూ, వ్యవసాయ అధికారులు సంయుక్తంగా గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేయాలి. కౌలు కౌలు రైతులను గుర్తించడంతో పాటు పొలం యజమానులను ఒప్పించి పొలాలు కౌలుకు ఇచ్చినట్లు ఒప్పంద పత్రం రాయించి ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం వారికి కార్డులు మంజూరు ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. కానీ అలాంటి ప్రక్రియ ఎక్కడా జరగడం లేదు. ఈ వ్యవసాయ సంవత్సరానికి సంబంధించి జిల్లాలో కౌలు రైతులు 50,000 (అంచనా) కాగా సుమారు 45 వేల మంది కౌలు కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఇప్పటి వరకు 5,935 మందికి మాత్రమే పంపిణీ చేసినట్లు సమాచారం. ఇందులో కూడా సగానికి పైగా టీడీపీ నాయకులు తమ బినామీలకు కౌలుకు ఇచ్చినట్లు కార్డులు రాయించినట్లు చర్చించుకుంటున్నారు.
అంతటా ‘పచ్చ’పెత్తనం
ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే కౌలు రైతులకు పెట్టుబడి సాయంగా రూ. 20 వేలు చొప్పున అందజేయడంతో పాటు అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పవన్ కల్యాణ్ ఊరూరా తిరిగి ఊదరగొట్టారు. అయితే ఈ సాయాన్ని కాజేసేందుకు ‘పచ్చ’తమ్ముళ్లు శతవిధాలా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అర్హులకు కార్డులు ఇవ్వకుండా వ్యవసాయాధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. మరికొందరు తమ్ముళ్లు ఇందులో ‘మా కేంటి’ అంటూ బేరం పెడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అన్నదాత సుఖీభవ కింద రూ. 20 వేలతో పాటు ఇతర సంక్షేమ పథకాలు కాజేయడమే లక్ష్యంగా సీసీఆర్సీలను దర్జాగా పొందేందుకు యత్నిస్తున్నారు. వ్యవసాయమంటే ఏంటో తెలియని అనేక మంది పచ్చ నేతలు తమ ఇళ్లలో పనిచేసేవారు, బంధువులు, అనుచరుల పేరుతో కార్డులు పొందినట్లు గ్రామాల్లో చర్చించుకుంటున్నారు.
ఇవి ప్రయోజనాలు..
● సీసీఆర్ కార్డుల వల్ల బ్యాంకుల్లో 7 శాతం వడ్డీతో రుణాలు పొందవచ్చు.
● క్రమం తప్పకుండా రుణం చెల్లిస్తే సున్నా వడ్డీ వర్తిస్తుంది.
● పంట నష్టం జరిగినప్పుడు బీమా, ఇన్‌ఫుట్ సబ్సిడీ పొందుతారు.
● ఎరువులు, విత్తనాలపై ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు పొందవచ్చు.
● కొన్ని రకాల వ్యవసాయ పరికరాలను సబ్సిడీపై తీసుకోవచ్చు.
కౌలు రైతులకు తప్పని తిప్పలు
పంట సాగు హక్కు పత్రాల
అందజేతపై ప్రభుత్వ నిర్లక్ష్యం
ఖరీఫ్ ప్రారంభమై రెండు నెలలు
కావస్తున్నా అందని సీసీఆర్ కార్డులు
కౌలు రైతుల సంక్షేమానికి
గత ప్రభుత్వం పెద్దపీట
జిల్లాలో కౌలు రైతులు
50,000 (అంచనా)
కౌలు కార్డుల పంపిణీ లక్ష్యం
45,000
ఇప్పటి వరకు పంపిణీ
5,935

కౌలు రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం అంటూ గొప్పలు చెప్

కౌలు రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం అంటూ గొప్పలు చెప్