
కౌలు రైతులకు అండగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం
రైతులతో పాటు కౌలు దారులకు సైతం గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కొండంత అండగా నిలిచింది. భూ యజమానుల హక్కులకు ఏమాత్రం భంగం కలుగకుండా కేవలం 11 నెలల కాలానికి సాగు ఒప్పందం చేస్తూ 2011 కౌలు చట్టాన్ని సవరించింది. ఖరీఫ్, రబీ సీజన్‌లకు సంబంధించి ఒకసారి జారీ చేసిన కార్డును మళ్లీ భూ యజమాని అంగీకరం మేరకు రెన్యువల్ చేసుకునే వీలును కల్పించారు. భూ యజమానుల్లో అపోహలు తొలగించడంతో జిల్లాలో సీసీఆర్‌సీ కార్డుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అసలు రైతుల మాదిరిగానే కౌలు రైతులకు పంట రుణాలు, రాయితీ విత్తనాలు, క్రాప్ ఇన్సూరెన్స్, ఇన్‌ఫుట్ సబ్సిడీ వంటి పరిహారం అందించి అండగా నలించింది.