
టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరిక
కల్లూరు: పాణ్యం మండలం తమ్మరాజుపల్లె గ్రామంలో టీడీపీకి చెందిన పది కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. మంగళవారం తమ్మరాజు పల్లె వైఎస్సార్‌సీపీ నాయకులు కోడె శేషయ్య ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి సమక్షంలో పది కుటుంబాల సభ్యులు పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారందరికీ కాటసాని కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. గోవర్దన్, ఎం. మహేంద్ర, హరిష్, వేణు, శ్రీధర్, కేశవ, మద్దిలేటి, రాజేష్, మహేంద్ర, షేక్షా హుస్సేన్ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలం కావడంతో పార్టీ వీడి వైఎస్సార్‌సీపీలో చేరినట్లు తెలిపారు.