
చాతుర్మాస దీక్షలో పీఠాధిపతి
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు 13వ చాతుర్మాస దీక్ష స్వీకరించారు. మంగళవారం ఉదయం పూజామందిరంలో వేద మంత్రోచ్ఛారణలు, విశిష్ట పూజోత్సవాలు మధ్య దీక్ష చేపట్టారు. ముందుగా రాఘవేంద్రుల మూల బృందావనంతో దీక్ష పదార్థాలకు పూజలు గావించారు. రాములోరి సంస్థాన పూజ చేపట్టి శాస్త్రోక్తంగా దీక్షబూనారు. మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ ఎస్.కె.శ్రీనివాసరావు, వెంకటేష్ జోషి, సురేష్ కోన్నాపూర్ దీక్ష క్రతువులో పాల్గొన్నారు. 49 రోజుల పాటు స్వామిజీ దీక్షలో కొనసాగనున్నారు. ఆనవాయితీలో భాగంగా దీక్ష సమయంలో నియమావళి ప్రకారం ఆహారం, ఫలాలు, కూరగాయలు స్వీకరిస్తారు.