
ఏమి చేశారని సుపరిపాలన
ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం ఏమి చేసిందని సుపరిపాలన అంటూ అధికార పార్టీ నేతలు ఊర్లలో పర్యటిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ప్రశ్నించారు. అధికారం కోసం ప్రజలను మోసం చేసిన చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితమంతా అబద్ధాలేనని విమర్శించారు. ‘బాబూ ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండల కేంద్రం బండిఆత్మకూరులో శిల్పా చక్రపాణి పర్యటించారు. సీఎంగా చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలకు వివరించారు. హామీలను ఎగ్గొట్టడంలో బాబు ఆరితేరారన్నారు. – బండిఆత్మకూరు
సమావేశంలో మాట్లాడుతున్న
మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి