
అక్రమ కేసులతో అణచివేయలేరు
నంద్యాల: అక్రమ కేసులతో వైఎస్సార్‌సీపీని అణచివేయలేరని ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా అన్నారు. చంద్రబాబు అంత టి దివాలా కోరు రాజకీయ నాయకుడు మరెవరూ లేరని విమర్శించారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో చరమగీతం పాడాలన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్త లను వేధించడమే లక్ష్యంగా పనిగా పెట్టుకుందన్నారు. మద్యం కేసు అంటూ అక్రమ అరెస్ట్‌లు చేసినా ఎవరూ భయపడే ప్రసక్తి లేదన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు నూతన మద్యం పాలసీ తెచ్చి ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం లేకుండా చేసి ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చిందన్నారు. జగన్‌కు సన్నిహితంగా ఉంటున్నారని ఎంపీ మిథున్‌రెడ్డిపై కేసు పెట్టారని, ఎలాంటి సాక్ష్యాధారాలు లే కుండా అక్రమంగా పెట్టిన ఈ కేసు చెల్లదన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయకుండా చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
చిన్నారిపై పిచ్చి కుక్కదాడి
పాములపాడు: బానుముక్కల గ్రామంలో గడ్డం జయమ్మ అనే ఏడేళ్ల చిన్నారిపై ఆదివారం పిచ్చి కుక్క దాడి చేసింది. ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిపై అందరూ చూస్తుండగానే దాడి చేసింది. కంటి పైభాగంలో తీవ్ర గాయమైంది. అక్కడే ఉన్న స్థానికులు పిచ్చికుక్కనే తరిమేశారు. గ్రామంలో పిచ్చి పట్టిన ఓ కుక్క సుమారు 20కి పైగా వీధి కుక్కలను కరిచిందని, అప్పటి నుంచి పిచ్చి కుక్కల బెడద తీవ్రంగా ఉందని గ్రామస్తులు వాపోతున్నారు.గాయపడిన చిన్నారిని కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.