
చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్దాం
కోవెలకుంట్ల: సీఎం నారా చంద్రబాబు మోసపూరిత హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని లక్ష్మీ వెంకటేశ్వర ఫంక్షన్ హాలులో ‘బాబు ష్యూరిటీ– మోసం గ్యారెంటీ’ కార్యక్రమంపై వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. చంద్రబాబు సీఎంగా ప్రతి సారి అబద్ధపు హామీలతోనే పాలన సాగిస్తారని విమర్శించారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రధాన ప్రతి పక్ష పార్టీ అయినప్పటికీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు కూటమి సర్కార్‌కు భయం పట్టుకుందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్‌సిక్స్‌తో పాటు మరో 143 హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రైతులకు అన్నదాత సుఖీభవ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, ప్రతి మహిళకు నెలకు ఆడబిడ్డ నిధికి కింద రూ. 1,500 ఎందుకు ఇవ్వలేకపోతున్నారని మండిపడ్డారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలు తెచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదేనన్నారు. ఆ మెడికల్ కళాశాలల్లో కూటమి ప్రభుత్వానికి చేతకాక విద్యార్థులకు సీట్లు ఇవ్వలేకపోతోందన్నారు. చంద్రబాబు మోసపూరిత హామీలను ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లేందుకు శ్రీకారం చుట్టామన్నారు. కూటమి సర్కార్ మోసాలను వైస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గ్రామస్థాయిలోకి తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.
సూపర్‌సిక్స్ అమలు చేయకుండానే
సుపరిపాలన ఎలా?
ప్రతి పక్ష హోదా ఇచ్చేందుకు కూటమి
సర్కార్‌కు వణుకు
మాజీ ఎమ్మెల్యే కాటసాని,
జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల