
మాదక ద్రవ్యాల నియంత్రణకు కార్యాచరణ
నంద్యాల(న్యూటౌన్): మాదక ద్రవ్యాల నియంత్రణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలని అధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మత్తు పదార్థాలకు బానిసైతే కలిగే దుష్ప్రభావాలపై పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థల్లో వీడియోలు ప్రదర్శించాలన్నారు. ప్రముఖ కూడళ్లలో హోర్డింగులు ఏర్పాటు చేయాలని, వాల్ పోస్టర్లు ప్రదర్శించాలని సూచించారు. కళాజాతా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మాదకద్రవ్యాల నివారణ కోసం జూన్ 1నుండి జూన్ 26వ తేదీ వరకు సంబంధిత అధికారులు బృందాలుగా వెళ్లి నిర్దేశించిన కార్యక్రమాలను చేపట్టాలన్నారు.. మత్తు పదార్థాల నియంత్రణపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు గాను వ్యాసరచన పోటీలు, వక్తృత్వ పోటీలను నిర్వహించాలన్నారు. విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు రయిజ్ ఫాతిమా, ఎకై ్సజ్ శాఖ సూపరింటెండెంట్ రవికుమార్, డీఈఓ జనార్దన్ రెడ్డి, డీఐఈఓ సునీత, ఐసీడీఎస్ పీడీ లీలావతి, జువైనల్ హోం సూపరింటెండెంట్ హుస్సేన్‌బాషా తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ రాజకుమారి