నంద్యాల(న్యూటౌన్): రెడ్ క్రాస్ సొసైటీల ద్వారా అత్యుత్తమ సేవలందించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి రెడ్ క్రాస్ అవార్డు దక్కింది. ఈ క్రమంలో గురువారం విజయవాడలో గవర్నర్ అబ్దుల్ నజీర్ నుంచి కలెక్టర్ అవార్డుతో పాటు గోల్డ్ మెడల్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఇటీవల అధునాతన వసతులతో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ బ్లడ్ స్టోరేజ్ సెంటర్‌ను ప్రారంభించామన్నారు. రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో ప్రజలకు అత్యంత తక్కువ ధరలకు లభ్యమయ్యేలా జనరిక్ మెడికల్ షాప్‌ను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రక్తదానానికి యువత స్వచ్ఛందంగా ముందుకొచ్చేలా అవగాహన కల్పిస్తామన్నారు. మత్స్యకారులు, చెంచులకు రెడ్ క్రాస్ సంస్థ ద్వారా మరిన్ని వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు.
మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా డాక్టర్ సురేఖ
గోస్పాడు: నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా డాక్టర్ సురేఖ గురువారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడి మెడికల్ కాలేజీలో ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ శ్రీదేవి ఇటీవల ఉద్యోగ విరమణ పొందారు. ఆమె స్థానంలో కడప ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న డాక్టర్ సురేఖను ఉన్నతాధికారులు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలకు అడ్డుకట్ట
బొమ్మలసత్రం: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేరగాళ్లను గుర్తించి నేరాల కట్టడికి అడ్డుకట్ట వేయాలని జిల్లా ఎస్పీ అధిరాజ్‌సింగ్‌రాణా పోలీసు అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక రామకృష్ణా పీజీ కళాశాల ఆడిటోరియమ్‌లో ఫోరెన్సిక్ సైన్స్ ఎవిడెన్స్ మేనేజ్‌మెంట్‌పై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. కేసుల దర్యాప్తులో ఆధారాలు, సాక్ష్యాలు కీలకమన్నారు. కేసు దర్యాప్తు తప్పుదోవ పట్టకుండా ఆధునిక సాంకేతిక ద్వారా నేరస్తులను గుర్తించే అవసరం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎస్‌పీ మందా జావళి ఆల్ఫోన్స్, ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్, ఫోరెన్సిక్ వైద్య నిపుణులు అసిమ్‌బాషా, కృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్‌కురెడ్‌క్రాస్ అవార్డు