
రైతుల కష్టం నేలపాలు!
నంద్యాల(అర్బన్): జిల్లాలో శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం వరకు ఓ మోస్తరు వర్షంతో పాటు గాలులు బీభత్సం సృష్టించాయి. విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు నేలకొరిగాయి. జిల్లాలోని దొర్నిపాడు, బేతంచెర్ల మండలాల్లో వరి ధాన్యం తడిసిపోయింది. అంతే కాకుండా పెనుగాలులకు ఇళ్ల పైకప్పులు ఎగిసి పడ్డాయి. మామిడి రైతులు తీవ్రంగా నష్టోపోవాల్సి వచ్చింది. నంద్యాల, డోన్, ప్యాపిలి, మహానంది, బండిఆత్మకూరు తదితర మండలాల్లో దాదాపు వందలాది ఎకరాల్లో అరటి చెట్లు నేలకొరిగాయి. దొర్నిపాడు, ఆళ్లగడ్డ, శిరివెళ్ల, చాగలమర్రి తదితర మండలాల్లో బొప్పాయి, కర్బుజా పంటలకు నష్టం వచ్చింది. జిల్లాలో దాదాపు రూ.50లక్షల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. తీవ్రంగా నష్టపోయామని, ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

రైతుల కష్టం నేలపాలు!