శ్రీరస్తు.. శుభమస్తు
నంద్యాల(న్యూటౌన్): శుభ ముహూర్తాలు ప్రారంభమయ్యాయి. పెళ్లిళ్లను అంగరంగ వైభవంగా చేసుకునేందుకు కొత్త జంటలు సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 18 నుంచి జాన్ 8వ తేదీ వరకు వరుస ముహూర్తాలు ఉండడంతో వివాహాలు జోరందుకోకున్నాయి. ఏప్రిల్లో 6, మే నెలలో 15, జూన్ నెలలో 6 శుభ ముహూర్తాలు ఉన్నాయి. జూన్ 11 నుంచి జూలై 12 వరకు ఆషాఢం కావడంతో శుభకార్యాలకు ఎటువంటి ముహూర్తాలు లేవని పురోహితులు చెబుతున్నారు. మరలా జూలై 25 నుంచి శ్రావణమాసంలో మంచి ముహూర్తాలు ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో ఏప్రిల్, మే, జూన్ నెలల్లో అధిక సంఖ్యలో వివాహాలు జరిపించేందుకు తల్లిదండ్రులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో కల్యాణ మండపాలు రిజర్వ్ చేసుకుంటున్నారు. డెకరేషన్, క్యాటరింగ్, మంగళ వాయిద్యాలకు అడ్వాన్‌లు ఇస్తున్నారు.
జోరుగా వ్యాపారం..
పెళ్లిళ్ల సీజన్ కావడంతో నంద్యాల జిల్లాలో బంగారం, వస్త్ర వ్యాపారాలు జోరందుకున్నాయి. భజంత్రీలు, ఫ్లవర్ డెకరేటర్లు, పురోహితులు, వంట మాస్టర్లు, స్వీట్లు, ఫొటో, వీడియోగ్రాఫర్లు, కల్యాణ మండపాలకు మంచి డిమాండ్ పెరిగింది.
మూడు నెలల్లో అధికం
గతేడాది వేసవి కంటే ఈ ఏడాది వేసవి మూడు నెలల్లో అధిక ముహూర్తాలున్నాయి. ముఖ్యంగా మే నెలలో 15 ముహూర్తాలు ఉన్నాయి. ముహూర్తాలు ఎక్కువ కావడంతో పురోహితులను సమకూర్చడం కష్టంగా మారుతోంది.
–శివయ్య, పురోహితుడు, నంద్యాల
ప్రారంభమైన శుభ ముహూర్తాలు
ఏప్రిల్ 18 నుంచి జూన్ 8 వరకు
వివాహాల సందడి
ఇవీ శుభ ముహూర్తాలు...
నెల తేదీలు
ఏప్రిల్ 20, 21, 23, 30
మే 1, 3, 4, 8, 9, 10, 11, 14,
16, 19, 21, 23, 24, 30
జూన్ 2, 4, 5, 6, 7, 8


