విలువైన ప్రభుత్వ భూములు ఉంటే చాలు టీడీపీ నాయకులు, కార్యకర్తలు రాబందుల్లా వాలిపోతున్నారు. స్థలమంతా తమదే అని హంగామా సృష్టిస్తున్నారు. ప్లాట్లు వేస్తున్నామని, తక్కువ ధరకే స్థలం ఇస్తామని ‘రియల్‌’ మోసం చేస్తున్నారు. వంక పోరంబోకు భూములను సైతం వదలడం లేదు. అధికార | - | Sakshi
Sakshi News home page

విలువైన ప్రభుత్వ భూములు ఉంటే చాలు టీడీపీ నాయకులు, కార్యకర్తలు రాబందుల్లా వాలిపోతున్నారు. స్థలమంతా తమదే అని హంగామా సృష్టిస్తున్నారు. ప్లాట్లు వేస్తున్నామని, తక్కువ ధరకే స్థలం ఇస్తామని ‘రియల్‌’ మోసం చేస్తున్నారు. వంక పోరంబోకు భూములను సైతం వదలడం లేదు. అధికార

Apr 15 2025 1:48 AM | Updated on Apr 15 2025 1:48 AM

విలువ

విలువైన ప్రభుత్వ భూములు ఉంటే చాలు టీడీపీ నాయకులు, కార్య

ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన

టీడీపీ నాయకులు

16.50 ఎకరాల వంక

పోరంబోకు భూమి కబ్జా

అక్రమంగా మట్టి తోలి

రహదారుల నిర్మాణం

యథేచ్ఛగా మంత్రి అనుచరుల

ఆక్రమణలు !

ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో

రూ.లక్షల్లో అక్రమ వసూళ్లు

నకిలీ పత్రాలు సృష్టించి

ఇష్టానుసారం మోసాలు

నంద్యాల(అర్బన్‌): వంక పోరం బోకు భూములను టీడీపీ నేతలు ఆక్రమించారు. అంతేకాకుండా అందులో ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారు. రెవెన్యూ అధికారులకు తెలిసినా టీడీపీ నాయకులే కదా అని పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. నల్లమల కొండల నుంచి వచ్చే వర్షపు నీరు మహానంది మండలం నందిపల్లె వద్ద రెండు పాయలుగా విడిపోతుంది. పెద్దకొట్టాల గ్రామ సమీపంలో పాలేరు వాగుగా, అయ్యలూరు గ్రామం చిన్న చెరువు సమీపంలో అయ్యలూరు వాగుగా ప్రవహిస్తోంది. చెరువు సమీపం నుంచి వచ్చే వాగు దాదాపు 65 అడుగుల వెడల్పు, 3.50 కి.మీ పొడవు ఉంది. అయ్యలూరు మెట్ట సమీపంలో ఉన్న శ్రావణలక్ష్మి సీడ్‌ ప్లాంట్‌, న్యూ వెంకటేశ్వర సీడ్‌ ప్లాంట్ల మీదుగా చాబోలు బైపాస్‌ కింద వెళ్తూ రైతునగర్‌, కానాల, గోస్పాడు మండలం చింతకుంట్ల మీదుగా కుందూలో కలుస్తోంది. చాబోలు బైపాస్‌ వరకు దాదాపు 16.50 ఎకరాల వంక పోరంబోకు భూములు ఉన్నాయి. ఈ భూముల్లో పలు రకాల సర్వే నంబర్ల ద్వారా ఎన్నో ఏళ్లుగా పలువురు రైతులు ఎకరం, అర ఎకరం సాగు చేసుకుంటూ వస్తున్నారు. భూముల ధరలకు రెక్కలు రావడం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అవడంతో టీడీపీ నాయకులు బరితెగించారు. జాతీయ రహదారి సమీపాన ఉన్న సర్వే నంబరు 21/1లోని 1.99 ఎకరాల భూములను ప్రొక్లెయీన్‌ల ద్వారా చదును చేశారు.

మంత్రి అనుచరులే!

నంద్యాల మండలంలోని చాబోలు గ్రామ సమీపంలో జాతీయ రహదారి పక్కన ప్రస్తుతం సెంటు విలువ బహిరంగ మార్కెట్లో రూ.12లక్షల నుంచి రూ.15లక్షలు పలుకుతోంది. రహదారి సమీపంలో వంక పోరంబోకు స్థలాన్ని ఆక్రమించిన మంత్రి ఫరూక్‌ అనుచరులు కొందరు ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారు. రెవెన్యూ అధికారులకు తెలిసినా మంత్రి అనుచరులకే కదా అంటూ సమస్యను పట్టించుకోవడం లేదనే విమర్శలు వినబడుతున్నాయి. నంద్యాల పట్టణానికి చెందిన 37మంది భవన నిర్మాణ మేసీ్త్రలకు మంత్రి ద్వారా పట్టాలు ఇస్తామంటూ సెంటు రూ.2లక్షలు చొప్పున అమ్మకాలకు పెట్టారు. రహదారులు నిర్మించడమే కాకుండా హద్దు రాళ్లు ఏర్పాటు చేశారు. నేషనల్‌ హైవేకు సమీపాన ఉండటంతో స్థలాలు హాట్‌ కేక్‌ల్లా అమ్ముడయ్యాయి.

ఇవీ కష్టాలు..

అయ్యలూరు గ్రామ సమీపం నుంచిచాబోలు బైపాస్‌ రోడ్డు వరకు దాదాపు 16.50 ఎకరాల వంక పోరంబోకు భూములు ఉన్నాయి. వంక సమీపాన ఉన్న రైతులు ఏడాదికింత చదువును చేస్తూ వెళ్లారు. దీంతో 65 అడుగుల మేర వెడల్పు ఉన్న వంక ఏడాదికేడాది కుచించుకపోతూ వచ్చింది. పలువురు రెవెన్యూ అధికారుల సహకారంతో సర్వే నంబర్లు సృష్టించుకొని పంటలు సాగు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి అనుచరులు కొందరు పోరంబోకు భూములను ఆక్రమించుకున్నారు. కాల్వ వెడల్పు తగ్గడంతో వర్షా కాలంలో పై నుంచి ఉధృతంగా వచ్చే వర్షపునీరు పారేందుకు కాల్వ సరిపోకపోవడంతో సమీప ప్రాంతాల్లోని పంటల పొలాలను ముంచెత్తుతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

వైఎస్సార్‌సీపీ హయాంలో ఇలా చేశారు

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నంద్యాల మండలం చాబోలు గ్రామం బైపాస్‌ రోడ్డు సమీపంలో ఉన్న వంకపోరం బోకు భూమిలో కొంత మంది ఆక్రమణ దారులు పెద్ద షెడ్లను ఏర్పాటు చేశారు. భూ ఆక్రమణలకు పాల్పడ్డారు. ఆక్రమణలు వెలుగు చూడటంతో స్పందించిన ప్రభుత్వం రెవెన్యూ అధికారుల ద్వారా షెడ్లను కూల్చివేయించింది. ఆక్రమణ దారుల భరతం పట్టింది.

విచారణ జరుపుతాం

నంద్యాల మండలం చాబోలు బైపాస్‌ వద్ద వంకపోరంబోకు ఆక్రమణల విషయం మా దృష్టికి వచ్చింది. విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం.

– శ్రీనివాసులు, నంద్యాల తహసీల్దార్‌

ప్రస్తుతం దుస్థితి ఇదీ..

జిల్లాలో వంక, ప్రభుత్వ పోరంబోకు, సీలింగ్‌, ఇతర ఖాళీ స్థలాలు కనపడితే చాలు టీడీపీ నాయకులు కబ్జా చేస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఇలాంటి ఆక్రమణలు జరుగుతున్నా నివారించాల్సిన రెవెన్యూ వ్యవస్థ నిద్రావస్థలో ఉన్నట్లు కనిపిస్తోందని పలువురు విమర్శిస్తున్నారు. ఆక్రమణల విషయం తెలిసినా అధికారులు మాత్రం చూిసీచూడనట్లు వ్యవహరిస్తూ ఉద్యోగ భద్రతలో నిమగ్నమయ్యారు. మరికొంత మంది తహసీల్దార్లు కాసులకు కక్కుర్తి పడుతూ ఆక్రమణ దారులకు పరోక్ష సహకారం అందిస్తున్నట్లు సమాచారం.

విలువైన ప్రభుత్వ భూములు ఉంటే చాలు టీడీపీ నాయకులు, కార్య1
1/2

విలువైన ప్రభుత్వ భూములు ఉంటే చాలు టీడీపీ నాయకులు, కార్య

విలువైన ప్రభుత్వ భూములు ఉంటే చాలు టీడీపీ నాయకులు, కార్య2
2/2

విలువైన ప్రభుత్వ భూములు ఉంటే చాలు టీడీపీ నాయకులు, కార్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement