
మానవ అక్రమ రవాణాపై అప్రమత్తంగా ఉండాలి
నంద్యాల: మానవ అక్రమ రవాణాపై అప్రమత్తంగా ఉండాలని వాటి నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవానికి సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలు అక్రమ రవాణాకు గురి కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఎక్కడైనా అక్ర మ రవాణా జరుగుతుందని తెలిసి నట్లయితే వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ 1098కి లేదా 1800– 1027–222కు సమాచారం ఇస్తే వెంటనే సంబంధిత శాఖల సమన్వయంతో వెంటనే బాలల రక్షణ కోసం చర్యలు తీసుకుంటామన్నారు. దీనికి బాధితులుగా సీ్త్రలు, పిల్లలు, వలసదారులు, ఇతర బలహీన వర్గాల ప్రజలు ఎక్కువగా ఉంటారన్నారు. అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అవగాహన కల్పించి, బాధితులకు సహాయం చేయా లన్నారు. జిల్లాలో హెల్త్ ఎడ్యుకేషన్, రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించి మానవ అక్రమ రవాణాపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో సీ్త్ర,శిశు సంక్షేమ శాఖ పీడీ లీలావతి, ప్రోగ్రాం కోఆర్డినేటర్ సంపత్, రాజు తదితరులు పాల్గొన్నారు.