
వన్యప్రాణి కనిపిస్తే క్లిక్
అటవీ సంరక్షణ మొత్తం కను సన్నల్లో సాగుతోంది అంటే అతిశయోక్తి కాదు. ప్రధానమైన ప్రాంతాల్లో ఇన్‌ఫ్రారెడ్ కెమెరాలు ఏర్పాటు చేయడంతోనే ఇది సాధ్యమైంది. ఏ జీవమున్న కదలిక కెమెరాల ముందు జరిగితే చాలు కెమెరా ట్రిగ్గర్ అయి క్లిక్‌మని ఫొటోలు తీస్తుంది. అంతే కాక ఇవి ఆన్‌లైన్‌లో వెంటనే చూసే అవకాశం కూడా ఉంది. దీనితో వన్యప్రాణుల స్థితిగతులు, వాటిని వేటాడే వ్యక్తుల కదలికలు ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది. ఉచ్చులకు చిక్కిన పులులను కూడా ఇలాగే గుర్తించి సంరక్షించిన ఘటనలు కూడా ఉన్నాయి.