శ్రమనే ఆమె నమ్ముకున్నారు. కుటుంబానికి అండగా ఉండేందుకు వివాహానికి దూరంగా ఉన్నారు. ధైర్యంగా తన పనులు నిర్వహిస్తూ ఖైరూన్‌బీ అందరికీ ఆదర్శంగా నిలిచారు. దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామానికి చెందిన రంజాన్, భక్షోబీ దంపతులకు నలుగురు సంతానం. ఇందులో ఇద్దరు కుమారులు కాగా.. ఖైరూన్‌బీ, బిస్మిలా కుమార్తెలు. ఖైరూన్‌బీ వివాహం చేసుకోకుండా కుటుంబానికి అండగా నిలిచారు. తల్లిదండ్రులతో పాటు పొలం పనులకు వెళ్లేవారు. వ్యవసాయ పనులు లేని సమయంలో టైర్లకు పంక్చర్లు వేయడం నేర్చుకున్నారు. కప్పట్రాళ్ల బస్టాండు సమీపంలో పంక్చర్ల షాపును సైతం ఏర్పాటు చేసుకున్నారు. సైకిల్ టైర్లతోపాటు టాక్టర్లు, జేసీబీ టైర్లకు పంక్చర్లు వేస్తున్నారు. వచ్చిన మొత్తాన్ని కుటుంబానికి ఇస్తున్నారు. – ఆలూరు