రవణమ్మ ..ఒక గ్రామ పంచాయతీకి సర్పంచ్ అయినా హంగు, ఆర్భాటం లేకుండా వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారు. నంద్యాల మండలం బిల్లలాపురం గ్రామ పంచాయతీ జనరల్ మహిళకు రిజర్వేషన్ అయ్యింది. దీంతో 2021 ఫిబ్రవరి 9వ తేదీన సర్పంచ్ ఎన్నికల్లో సంకల రవణమ్మ గెలుపొందారు. సర్పంచ్ అయినా సరే వ్యవసాయ పనులు చేయడంలో తనకు ఇబ్బందులు లేవని ఆమె తెలిపారు. సర్పంచ్ మాటల్లోనే వివరాలు..‘ నాకు చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే ఎంతో ఇష్టం. నేను గ్రామ సర్పంచ్ అయినా సరే నేను నమ్ముకున్న వృత్తిని ఎప్పుడూ వదిలి పెట్టలేదు. గ్రామంలో పారిశుధ్ధ్యం, తాగునీటి వసతి, వీధి దీపాల ఏర్పాటు.. తదితర పనులు చేపడుతూ ప్రజల మన్ననలు పొందుతుండటం ఆనందంగా ఉంది.’’
– నంద్యాల(అర్బన్)