అశ్వవాహనంపై ఆలయ ప్రదక్షిణ చేస్తున్న ఆదిదంపతులు (ఇన్‌సెట్) ఉత్సవమూర్తులు
శ్రీశైలంటెంపుల్: ఇలకై లాసమైన శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శనివారం ముగిశాయి. అక్కమహాదేవి అలంకార మండపంలో శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు అశ్వవాహనసేవ నిర్వహించారు. అనంతరం ఆలయ ఉత్సవం జరిపారు. డప్పువాయిద్యాలు, జానపద కళాకారుల నృత్యప్రదర్శనలు అకట్టుకున్నాయి. పలు రకాల సుగంధ పుష్పాలతో స్వామిఅమ్మవార్లకు పుష్పోత్సవం చేశారు. అనంతరం ఉత్సవమూర్తులకు అద్దాల మండపంలో (శయమందిరం)లో శయనోత్సవం నిర్వహించి.. చివరిగా స్వామిఅమ్మవార్లకు ఏకాంతసేవ జరిపారు. ఆయా పూజా కార్యక్రమాల్లో దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ముగిసిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
శ్రీశైలం.. పుష్పశోభితం