‘ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నాం. సూపర్‌ సిక్స్‌ అమలు చేసి తీరుతాం..’ అని బడ్జెట్‌ ప్రసంగంలో గొప్పగా చెప్పిన ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ కేటాయింపుల్లో మాత్రం చేతులెత్తేశారు. ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో సూపర్‌ సిక్స్‌కు పైస | - | Sakshi
Sakshi News home page

‘ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నాం. సూపర్‌ సిక్స్‌ అమలు చేసి తీరుతాం..’ అని బడ్జెట్‌ ప్రసంగంలో గొప్పగా చెప్పిన ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ కేటాయింపుల్లో మాత్రం చేతులెత్తేశారు. ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో సూపర్‌ సిక్స్‌కు పైస

Mar 1 2025 8:03 AM | Updated on Mar 1 2025 8:03 AM

ర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ అసెంబ్లీలో శుక్రవారం పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ప్రభుత్వం కొలువుదీరి తొమ్మిది మాసాలు పూర్తయినా ప్రధాన హామీ ‘సూపర్‌ సిక్స్‌’ అమలుపై మీనమేషాలు లెక్కించించింది. ఈ బడ్జెట్‌లోనైనా వాటిని అమలు చేస్తారని ఆశిస్తే నిరాశే మిగిలింది. తల్లికివందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్‌ సిలిండర్లకు అరకొర నిధులు కేటాయించగా.. తక్కిన యువనేస్తం, మహాశక్తి, ఉచిత బస్సు హామీలను అటకెక్కించింది. ఒకటి నుంచి ఇంటర్మీడియట్‌ వరకూ ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అందరికీ రూ.15వేల చొప్పున తల్లికి వందనం జమ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.9,407 కోట్లు మాత్రమే కేటాయించింది. ఈ నిధులను చూస్తే ఇంటికి ఒక్కరికి మాత్రమే నిధులు విడుదల చేస్తారని, అది కూడా అర్హులైన లబ్ధిదారులను భారీగా తగ్గిస్తారని స్పష్టమవుతోంది. ఇక అన్నదాత సుఖీభవ కింద కేవలం ఉమ్మడి కర్నూలు జిల్లాకే రూ.1061 కోట్లు అవసరం. కానీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రూ.6,300 కోట్లు మాత్రమే కేటాయించడం చూస్తే అమలు ఏస్థాయిలో ఉంటుందో అర్థమవుతుంది.

ఉద్యోగుల

ఆశలపై నీళ్లు

‘కూటమి ప్రభుత్వం’ తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెడుతుండటంతో ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్సీ, పెండింగ్‌ బకాయిలు, డీఏలపై ప్రకటన ఉంటుందని భావించారు. 2024లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పీఆర్సీ కమిషన్‌ వేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కమిషనర్‌ రాజీనామా చేశారు. ఇప్పటి వరకూ కమిషన్‌ ఏర్పాటు కాలేదు. బడ్జెట్‌లో వీటిపై కీలక ప్రకటనలు చేస్తారని ఆశించిన ఉద్యోగులకు నిరాశే మిగిలింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement