కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం వరకు ఆరు మండలాల్లో వర్షం కురిసింది. హొళగొంద 48, ఆలూరులో 18.2, కౌతాళంలో 14.2, కోసిగిలో 12.6, ఓర్వకల్లులో 3.8, ఎమ్మిగనూరు మండలంలో 1.4 మి.మీ. ప్రకారం వర్షపాతం నమోదైంది. ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే సమయంలో చెట్లు కింద, టవర్స్, పోల్స్ దగ్గర, బహిరంగ ప్రదేశాల్లో ఉండటం మంచిది కాదని బవనాసి కృషి విజ్ఞాన కేంద్రం వాతావరణ శాస్త్రవేత్త మహదేవయ్య తెలిపారు. కాగా.. జిల్లాలో ఉష్ణోగ్రతలు అదుపులోకి రావడం లేదు. ఇప్పటికీ 43–44 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి.
ఈ కేవైసీ తప్పనిసరి
కర్నూలు(అగ్రికల్చర్): పెన్షనర్లు విధిగా ఈ–కేవైసీ చేసుకోవాలని జిల్లా ఖజానా అధికారి రామచంద్రరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 17,634 మంది పెన్షనర్లు ఉండగా ఇప్పటి వరకు 12,150 మంది ఈ కేవైసీ చేయించుకున్నారని, ఇంకా 5,484 మంది ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. పెన్షనర్లు అందరూ ఈ–కేవైసీ చేయించుకునేందుకు వీలుగా జిల్లాలోని ప్రతి సబ్ ట్రెజరీలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నెల 4వ తేదీ ఆదివారం సెలవు అయిన్పటికీ అన్ని సబ్ ట్రెజరీలు పనిచేస్తాయని పేర్కొన్నారు.