బుద్ధవనంలో ఏఎస్‌ఓల బృందం | - | Sakshi
Sakshi News home page

బుద్ధవనంలో ఏఎస్‌ఓల బృందం

Apr 1 2026 7:24 AM | Updated on Apr 1 2026 7:24 AM

హాలియా : అంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌ను మంగళవారం అసిస్టెంట్‌ సెక్షన్‌ అధికారుల (ఏఎస్‌ఓల) బృందం సందర్శించింది. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న 70 మంది బృందం సభ్యులు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సెక్రటేరియట్‌ ట్రైనింగ్‌ అండ్‌ మెనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌ అమర్జిత్‌ సింగ్‌ ఆధ్వర్యంలో సాగర్‌కు చేరుకోగా వీరికి ప్రొటోకాల్‌ ఆర్‌ఐ దండ శ్రీనివాస్‌రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం వీరు లాంచీలో నాగార్జునకొండ మ్యూజియం, నాగార్జునసాగర్‌ డ్యాంతోపాటు బుద్ధవనంలోని పలు ప్రాంతాలను సందర్శించారు. బుద్ధుడి జీవిత విశేషాలు తెలిపే లఘు చిత్రాన్ని వీక్షించారు. మహాస్తూపంలో ధాన్యం చేశారు. వీరికి బుద్ధవనం ఎగ్జిక్యూటివ్‌ అధికారి శాసన, ఎస్టేట్‌ మేనేజర్‌ రవిచంద్ర, టూరిజం గైడ్‌ సత్యనారాయణలు బుద్ధ ధమ్మం, నాగార్జునకొండ, డ్యాం విశేషాలను వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement