జిల్లాకు బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు
నల్లగొండ : జిల్లాకు బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు లభించింది. ఈ మేరకు శనివారం రాత్రి రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి ప్రకటించారు. ఈ నెల 25న హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో జరిగే కార్యక్రమంలో అందించనున్నారు. జిల్లా స్థాయిలో బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డుకు మొన్నటి వరకు జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ఇలా త్రిపాఠి ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆమె బదిలీపై నిజామాబాద్ కలెక్టర్‌గా వెళ్లారు. దీంతో జిల్లా అధికారులు ఈ అవార్డును అందుకోనున్నారు. అలాగే రిటర్నింగ్ అధికారుల కేటగిరీలో మునుగోడు ఈఆర్వో శ్రీదేవి ఈ అవార్డుకు ఎంపికయ్యారు. బీఎల్వోల కేటగిరీలో సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన విజయలక్ష్మి కూడా ఎంపికయ్యారు.
చెర్వుగట్టు ప్రసాద తయారీ కేంద్రం తనిఖీ
నార్కట్‌పల్లి : మండలంలోని చెర్వుగట్టులో గల పార్వతి జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శనివారం జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి ఆధ్వర్యంలో ఆహార పరిరక్షణ శాఖ అధికారులు ఆలయ ప్రసాదం తయారీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ప్రసాదం తయారీకి సంబంధించిన ముడి పదార్థాల స్వీకరణ, నిల్వ విధానాలు, తయారీ ప్రక్రియలు, పరికరాల శుభ్రత, నీటి వినియోగం, వ్యర్థాల నిర్వహణ, సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత తదితర అన్ని అంశాలను పరిశీలించారు. ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ మొబైల్ ప్రయోగశాల ద్వారా స్పాట్ పరీక్షలు చేపట్టారు. పలు విషయాలపై సిబ్బందికి అవగాహన కల్పించి సూచనలు చేశారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, ఫుడ్ సేఫ్టీ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మేలైన పరిశోధనలు రావాలి
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీలో శనివారం వివిధ విభాగాల అధ్యాపకులకు ప్రాజెక్టు ప్రతిపాదనల రచనపై హైదరాబాద్‌లోని బీస్ సంస్థ ప్రతినిధులు ఒకరోజు వర్క్‌షాపు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన బీస్ సంస్థ ప్రతినిధులు ప్రొఫెసర్ సత్యనారాయణ, డాక్టర్ శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ ఉన్నత విద్యా సంస్థల నుంచి మేలైన పరిశోధనలు రావాలని, యూనివర్సిటీకేంద్రంగా సవాళ్లకు పరిష్కారా లు చూపాలన్నారు. పరిశోధన ప్రతిపాదనలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ వసంత, ప్రొఫెసర్ సాంబశివరావు, డాక్టర్ ప్రశాంతి, మాధురి, రామచంద్రర్‌గౌడ్, కళ్యాణి పాల్గొన్నారు.
మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్‌ల నియామకం
నల్లగొండ టూటౌన్ : మున్సిపల్ ఎన్నికల కోసం బీఆర్‌ఎస్ పార్టీ మున్సిపాలిటీల వారీగా ఇంచార్జిలను నియమించింది. ఈమేరకు బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం రాత్రి ఇన్‌చార్జ్‌ల జాబితాను ప్రకటించారు. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎమ్మెల్సీ కోటిరెడ్డి నియమితులయ్యారు. నందికొండ మున్సిపాలిటీకి గుజ్జ యుగేంధర్‌రావు, హాలియాకు తిప్పన విజయసింహారెడ్డి, దేవరకొండకు పాల్వాయి స్రవంతి, మిర్యాలగూడకు బడుగుల లింగయ్యయాదవ్, చండూరుకు వెంకటనారాయణగౌడ్, చిట్యాలకు చాడ కిషన్‌రెడ్డిని నియమించారు.


