గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించాలి
నల్లగొండ : గణతంత్ర వేడులకను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. శనివారం ఆయన నల్లగొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరుగుతున్న గణతంత్ర వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతిథులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఏఎస్పీ రమేష్, ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్‌రెడ్డి, గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్‌రెడ్డి, డీఈఓ భిక్షపతి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్ ఉన్నారు.
జాతీయ పతాకం ఆవిష్కరించనున్న కలెక్టర్
ఈ నెల 26న ఉదయం 9 గంటలకు జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో కలెక్టర్ బి.చంద్రశేఖర్ జాతీయ పతాకావిష్కరణ చేసి ప్రసంగించనున్నారు. ఉదయం 9.30 గంటలకు విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు, 9.50 గంటలకు ఆస్తుల పంపిణీ, 10 గంటలకు ఉద్యోగులకు ప్రశంసాపత్రాల పంపిణీ, 10.30 గంటలకు జాతీయ గీతాలాపన జరగనుంది.
ఫ కలెక్టర్ చంద్రశేఖర్


